
భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న హీరోలలో ప్రభాస్ ఒకరు. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యా్ప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్న డార్లింగ్.. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. చివరగా కల్కి 2898 ఏడీ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న డార్లింగ్.. ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ షూటింగ్స్ అంటూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నాడు. డార్లింగ్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. చాలా సినిమాలు వరుసలో ఉండడంతో కొన్నేళ్లపాటు ప్రభాస్ ఫ్రీ అయ్యే ఛాన్స్ కనిపించడం లేదు. అంతేకాదు.. ఇప్పటికీ డార్లింగ్ కొత్త కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే ఉన్నాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ మరింత ఖుషి అవుతున్నారు. మీకు తెలుసా.. ప్రభాస్ చేతిలో మొత్తం 9 సినిమాల వరకు ఉన్నాయి. ఇక ఇప్పుడు మరో ప్రాజెక్ట్ ఒప్పుకున్నట్లు టాక్.
తెలుగు సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం తాజాగా ప్రభాస్ ప్రముఖ ప్రోడక్షన్ కంపెనీ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో మరో సినిమా చేసేందుకు ఒప్పుకున్నారట. దర్శకుడి పేరు ఇంకా ప్రకటించకపోయినప్పటికీ ఇప్పటికే ఈ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో సంచలనంగా మారింది. ప్రస్తుతం ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు జరిగే కథలో సైనికుడిగా నటిస్తున్నాడు. ఈ సినిమాను రూ. 600 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
ప్రభాస్ చేతిలో ఉన్న సినిమా..
అంతేకాకుండా కేజీఎఫ్ నిర్మాతలు అయిన హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై దాదాపు మూడు సినిమాలు చేసేందుకు సైన్ చేశాడు. ఈ సినిమా బడ్జెట్ రూ.450 కోట్లు. ప్రస్తుతం చేతిలో అత్యధిక సినిమాలు ఉన్న హీరోగా ప్రభాస్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.
ఇవి కూడా చదవండి :
Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..
Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..
OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..