The Raja Saab: ప్రభాస్ సినిమాకు బిగ్ షాక్.. పోలీసులను ఆశ్రయించిన ది రాజా సాబ్ టీమ్.. ఏమైందంటే?

సలార్, కల్కి వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన ప్రభాస్ ఇప్పుడు ది రాజాసాబ్ గా మన ముందుకు వస్తున్నాడు. మారుతి తెరకెక్కిస్తోన్న ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలైంది. దీనికి డార్లింగ్ అభిమానుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. 

The Raja Saab: ప్రభాస్ సినిమాకు బిగ్ షాక్.. పోలీసులను ఆశ్రయించిన ది రాజా సాబ్ టీమ్.. ఏమైందంటే?
The Raja Saab

Updated on: Jun 20, 2025 | 2:54 PM

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం ది రాజా సాబ్. మారుతి తెరకెక్కిస్తోన్న ఈ హారర్ థ్రిల్లర్ కామెడీలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. అలాగే నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే రాజా సాబ్ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఇటీవల రిలీజైన టీజర్ అయితే ప్రభాస్ అభిమానులకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది.  ఫ్యాన్స్ ప్రభాస్ ను ఎలా చూడాలనుకుంటున్నారో మారుతి ప్రభాస్ ను అలా చూపించాడని ప్రశంసలు వచ్చాయి. ది రాజా సాబ్ లో హారర్ కంటెంట్ తో పాటు మారుతి మార్క్ కామెడీ, అలాగే హీరోయిన్లతో రొమాంటిక్ సీన్స్ కూడా ఉంటాయని టీజర్ చూస్ ఇట్టే అర్ధమవుతుంది. అయితే ఈ టీజర్ రిలీజ్ కు ముందే ది రాజాసాబ్ సినిమాకు బిగ్ షాక్ తగిలింది. ఈ సినిమా టీజర్ ను రిలీజ్ కు మూడు రోజుల ముందే గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో అప్రమత్తమైన ది రాజా సాబ్ టీమ్ పోలీసులను ఆశ్రయించింది. ప్రభాస్ సినిమా  టీజర్ లీక్‌పై  బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. ‘ఈనెల 16న ది రాజా సాబ్ టీజర్ రిలీజైంది. అయితే మూడు రోజుల ముందే టీజర్ సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. దీనికి కారకులైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని  సినిమా డబ్బింగ్‌ ఇన్‌ఛార్జ్ వసంత్‌కుమార్ పోలీసులను కోరారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ది రాజా సాబ్ సినిమాకు తమన్ సంగీతం అందించారు. సంగీతం తమన్‌ అందించారు. డిసెంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా ఇది విడుదల కానుంది. ఇందులో సంజయ్ దత్, అనుపమ్ ఖేర్, అనుమోలు సుశాంత్, జిషు సేన్ గుప్తా, ఎస్. జే. సూర్య, నవాబ్ షా, యోగి బాబు, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, నాజర్, రావు రమేష్, సాయి కుమార్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ది రాజా సాబ్ సినిమాలో ప్రభాస్

  మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి