Tollywood: ఒకప్పుడు వైజాగ్‌లో అరటి పండ్లు అమ్మాడు.. ఇప్పుడు 400 కోట్ల సినిమాతో సంచలనం.. ఎవరో తెలుసా?

సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే కఠోరశ్రమతో పాటు ఓపిక, సహనం తప్పనిసరి. అలాగే కూసింత అదృష్టం కూడా ఉండాలి. ఈ టాలీవుడ్ డైరెక్టర్ కూడా ఇండస్ట్రీలోకి రాక ముందు ఎన్నో పనులు చేశాడు. డిస్ట్రిబ్యూటర్ తో కెరీర్ ప్రారంభించి ఇప్పుడు క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు.

Tollywood: ఒకప్పుడు వైజాగ్‌లో అరటి పండ్లు అమ్మాడు..  ఇప్పుడు 400 కోట్ల సినిమాతో సంచలనం.. ఎవరో తెలుసా?
Tollywood Director

Updated on: Jun 08, 2025 | 5:37 PM

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ గా వెలుగొందుతోన్న వారిలో కెరీర్ ప్రారంభంలో ఎన్నో రకాల పనులు, ఉద్యోగాలు చేసిన వారే. అయితే ఈ టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ ది వేరే కథ. డైరెక్టర్ గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాక కూడా సహ నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా పని చేశాడు. తనకు కట్నంగా వచ్చిన డబ్బుతో అల్లు అర్జున్ నటించిన ఆర్య సినిమా కొన్నాడు. డిస్ట్రిబ్యూటర్ గా మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత డైరెక్టర్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. జయ పజయాలతో సంబంధం లేకుండా సినిమాలు తీశాడు. ఇప్పుడీ డైరెక్టర్ ఓ పాన్ ఇండియా సూపర్ స్టార్ తో కలిసి ఓ పాన్ ఇండియా మూవీ తీస్తున్నాడు. అది కూడా సుమారు రూ. 400 కోట్ల బడ్జెట్ తో. దీంతో ఈ టాలీవుడ్ డైరెక్టర్ పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. ఈ డైరెక్టర్ ఇప్పటివరకు పెద్ద హీరోలతో సినిమాలు చేయలేదు. ఈ క్రమంలో పాన్ ఇండియా సూపర్ స్టార్ తో ఈ దర్శకుడు ఎలాంటి సినిమా తీస్తాడోనని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు ఇతని సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? అతను మరెవరో కాదు ది రాజా సాబ్ డైరెక్టర్ మారుతి.

ప్రస్తుతం ప్రభాస్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉంటోన్న మారుతి తాజాగా మచిలీపట్నంలో నిర్వహిస్తున్న మసులా బీచ్‌ ఫెస్టివల్‌కు హాజరయ్యాడు. ఈ సందర్భంగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘నేను 1999లో హైదరాబాద్‌కు వచ్చాను. అంతకుముందు వైజాగ్‌లో అరటిపండ్లు అమ్మేవాడిని. ఇక్కడ రాధికా థియేటర్‌ ఎదురుగా నాన్నకు అరటిపండ్ల బండి ఉండేది. నేను కూడా అక్కడ పండ్లు అమ్ముతుండే వాడిని. 1999లో హైదరాబాద్‌కు వచ్చాను. అప్పుడు నాకు ఇక్కడ స్టిక్కరింగ్‌ షాపు ఉండేది. హిందూ కాలేజీలో చదువుకుంటూనే నెంబర్‌ ప్లేట్లు రెడీ చేసేవాడిని. ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక మనిషి కష్టపడితే ఎంత దూరమైనా వెళతాడన్న దానికి నేనేప్రత్యక్ష ఉదాహరణ. ఇప్పుడు నేను పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా రూ.400 కోట్ల బడ్జెట్‌తో పాన్‌ ఇండియా మూవీ తీస్తున్నా’

ఇవి కూడా చదవండి

డైరెక్టర్ మారుతి ట్వీట్..

‘ ప్రభాస్ ది రాజా సాబ్‌ మీరు ఊహించినదానికంటే ఒక శాతం ఎక్కువే ఉంటుంది. జూన్‌ 16న టీజర్‌ రిలీజ్‌ చేస్తున్నాం’ అని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత సోషల్ మీడియాలోనూ.. ‘ ఒట్టేసి చెబుతున్నా.. రాజా సాబ్‌ మూవీ ఓ వేడుకలా ఉంటుంది’ అని ట్వీట్ చేశాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..