Salaar Movie: డార్లింగ్ ఫ్యాన్స్‏కు గుడ్ న్యూస్.. సలార్ రీరిలీజ్.. ఎప్పుడంటే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మరోసారి రీరిలీజ్ ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడిప్పుడే మరిన్ని చిత్రాలను మళ్లీ విడుదల చేస్తున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, చిరంజీవి, ప్రభాస్ వంటి స్టార్ హీరోస్ సినిమాలు ఇప్పటికే రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి డార్లింగ్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీని రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.

Salaar Movie: డార్లింగ్ ఫ్యాన్స్‏కు గుడ్ న్యూస్.. సలార్ రీరిలీజ్.. ఎప్పుడంటే..

Updated on: Feb 25, 2025 | 7:15 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. డార్లింగ్ నటించే సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా వెయిట్ చేస్తుంటారో చెప్పక్కర్లేదు. ఇప్పటికే చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నారు డార్లింగ్. గతేడాది కల్కి మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రభాస్.. ప్రస్తుతం రాజాసాబ్, డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో స్పిరిట్ ప్రాజెక్ట్ సైతం పట్టాలెక్కనుంది. ఈ క్రమంలోనే డార్లింగ్ అభిమానులకు గుడ్ న్యూస్ అందించారు మేకర్స్. బ్లాక్ బస్టర్ హిట్ సలార్ సినిమాను అడియన్స్ ముందుకు మళ్లీ తీసుకురానున్నారు. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. మొదట్లో ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఆ తర్వాత సూపర్ హిట్ అయ్యింది.

కేజీఎఫ్ 1, 2 తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈసినిమాకు ఫ్యాన్స్ నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ఈ మూవీ సెకండ్ పార్ట్ షూటింగ్ స్టార్ట్ కానుంది.ఈ క్రమంలో తాజాగా సలార్ చిత్రాన్ని రీరిలీజ్ చేస్తున్నారు. మార్చి 21న ఈ సినిమాను మరోసారి వెండితెరపై ప్రదర్శించనున్నారు. ఈ మేరకు మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చింది. ప్రశాంత్ నీల్ భార్య సైతం ఈ రీరిలీజ్ గురించి పోస్ట్ చేసింది. ఆమె కూడా ఈ సినిమా రీరిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. మరోసారి రెబల్ ఫ్యాన్స్ సలార్ చిత్రాన్ని థియేటర్లలో ఎంజాయ్ చేయనున్నారు.

ఇప్పటికీ సోషల్ మీడియాలో సలార్ మూవీ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్, సాంగ్స్, డైలాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్ పాత్రకు ఎక్కువగా డైలాగ్స్ లేకపోయినప్పటికీ కేవలం యాక్టింగ్ తో ఇరగదీశాడు డార్లింగ్. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. త్వరలోనే సలార్ 2 ప్రాజెక్ట్ స్టార్ట్ కానుంది.

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..