
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమా కోసం దేశం మొత్తం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరక్కేక్కిన ఈ పై ఇప్పటికే భారీ బజ్ క్రియేట అయ్యింది. ప్రభాస్ అభిమానులతో పాటు ప్రేక్షకులంతా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ నటించిన సాహో , రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు నిరాశపరచడంతో అభిమానులంతా ఈ సినిమా పైనే ఆశలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు ఈ మాత్రం తగ్గకుండా తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ సినిమాతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న ప్రశాంత్ నీల్.. సలార్ సినిమాను కూడా అదే తరహాలో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
డిసెంబర్ 22న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ స్పీడ్ అందుకున్నాయి. ఇదిలా ఉంటే యూఎస్ బుకింగ్స్‌లో సలార్ సినిమా రికార్డ్ క్రియేట్ చేసిందని తెలుస్తోంది. ప్రభాస్ సినిమాలకు యూఎస్ లోనూ మంచి క్రేజ్ ఉంది. దాంతో అక్కడ డార్లింగ్ సినిమాలకు మంచి మార్కెట్ నెలకొంది. దాంతో ప్రభాస్ సినిమాలు యూఎస్ లోనూ రికార్డ్ క్రియేట్ చేస్తూ ఉంటాయి.
తాజాగా సలార్ సినిమా హాఫ్ మిలియన్ మార్క్‌ని జస్ట్ బుకింగ్స్ తోనే క్రాస్ చేసేసింది. సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి యూఎస్ లో సలార్ పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఇప్పుడు రికార్డ్ రేంజ్ లో బుకింగ్స్ కావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. సలార్ సినిమా ను హోంబళే ఫిల్మ్స్ భారీ స్థాయిలో నిర్మిస్తుంది. అలాగే రవి బసృర్ సంగీతం అందిస్తున్నారు. మరి ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
In the days when dinosaurs roamed wild 😎
Now emerges #Salaar, the most violent man, whose earth-shattering box office rage hits a bombastic $500K+ in pre-sales ( Premieres ) and counting 🔥🔥🤙🏾🤙🏾🤙🏾#SalaarCeaseFire #Prabhas pic.twitter.com/k0bmWtgvU2— Prathyangira Cinemas (@PrathyangiraUS) December 9, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.