యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. దాదాపు రెండేళ్లుగా ప్రభాస్ వెండితెరపై కనిపించలేదు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ ప్రభాస్ చిత్రాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ప్రభాస్.. పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ మూవీపై డార్లింగ్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. విదేశీ ప్రేమ కథ నేపథ్యంలో రాబోతున్న రాధేశ్యామ్ సినిమాకు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, టీ సిరీస్, గోపీకృష్ణ మూవీస్ వారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
వాస్తవానికి ఈ సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం దేశంలో ఓమిక్రాన్, కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కల్గిస్తోంది. దీంతో పలు రాష్ట్రాలు ఇప్పటికే కరోనా నిబంధనలను అమలు చేస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో 50 శాతం ఆక్యూపెన్సీతో థియేటర్లను నడిపిస్తుండగా.. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో టికెట్స్ రేట్స్ పై వివాదం కొనసాగుతుంది. దీంతో భారీ బడ్జె్ట్ చిత్రాలు వాయిదా పడ్డాయి. ఇందులో రాధేశ్యామ్ మూవీ కూడా ఒకటి. ఒమిక్రాన్, కరోనా కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల రీత్యా చిత్రాన్ని వాయిదా వేయాల్సి వస్తోంది. పరిస్థితులు చక్కబడిన తర్వాత తిరిగి మీ ముందుకు వస్తాం అంటూ రాధేశ్యామ్ చిత్రయూనిట్ నిన్న సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రకటించింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశకు లోనయ్యారు.
ఇదిలా ఉంటే.. తాజాగా రాధేశ్యామ్ న్యూరిలీజ్ డేట్ తెరపైకి వచ్చింది. సోషల్ మీడియాలో వినిపిస్తోన్న టాక్ ప్రకారం ఈ సినిమాను మార్చి 18న విడుదల చేయనున్నారట. వేసవిలో ఆర్ఆర్ఆర్ కూడా విడుదల కాబోతుంది. ఈ క్రమంలో పరిస్థితులు పూర్తిగా అనుకూలిస్తే వేసవిలోనే రాధేశ్యామ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారని టాక్. ఇక ఇదే డేట్ ను లాక్ చేసి.. త్వరలోనే ప్రకటించనున్నట్లుగా ఫిల్మ్ సర్కిల్లో నడుస్తోంది.
Gali Janardhan Reddy Son: హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న గాలి జనార్దన్ రెడ్డి కొడుకు.. దర్శకుడు ఎవరంటే..
Rana Daggubati : మరో రీమేక్‌ను లైన్‌లో పెట్టనున్న దగ్గుబాటి హీరో.. శింబు సినిమా పై కన్నేసిన రానా..