యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది కల్కి 2898 ఏడీ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు డార్లింగ్ నటిస్తున్న సినిమాల్లో రాజా సాబ్ ఒకటి. డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇన్నాళ్లు మాస్ యాక్షన్ చిత్రాలతో అలరించిన ప్రభాస్.. చాలా కాలం తర్వాత హారర్ కామెడీ మూవీతో అడియన్స్ ముందుకు రాబోతున్నారు. అలాగే ఈ సినిమాలో డార్లింగ్ వింటేజ్ లుక్ లో కనిపించనున్నారు. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇందులో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే.. సంక్రాంతి పండగ సందర్భంగా ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.
అందులో ప్రభాస్ కళ్లద్దాలు పెట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నారు. కొత్తగా షేర్ చేసిన పోస్టర్ లో ప్రభాస్ ఎంతో అందంగా, మరింత స్టైలీష్ గా కనిపిస్తున్నారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అంటూ ప్రభాస్ పోస్టర్ షేర్ చేసింది చిత్రయూనిట్. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకులలో మరిన్ని అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో సంజయ్ దత్, మురళి శర్మ, అనుపమ్ ఖేర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. అలాగే తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
‘ది రాజా సాబ్’ ప్రభాస్ నటిస్తున్న తొలి హారర్ కామెడీ చిత్రం. ఈ సినిమాను ఏప్రిల్ లో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ జపాన్ లో జరగనున్నట్లు తెలుస్తోంది. జపనీస్ వెర్షన్ లో ఓ సాంగ్ ఉంటుందని.. డ్యూయెట్, స్పెషల్ సాంగ్, ముగ్గురు హీరోయిన్లతో పాటు, హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఉంటుదని తెలిపాడు.
Happy Sankranthi Darlings ❤️
Manam yeppudu vasthe appude Asalaina Panduga….Twaralo Chithakkottedham 🔥#TheRajaSaab will meet you soon in theatres. pic.twitter.com/pVAW0nyTjI
— The RajaSaab (@rajasaabmovie) January 14, 2025
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..