Prabhas: మారుతి మూవీ షూటింగ్ నుంచి లీకైన ప్రభాస్ ఫోటో.. నెట్టింట వైరల్
డార్లింగ్ లిస్ట్‌లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ఆదిపురుష్. అన్ని అనుకున్నట్టుగా జరిగుంటే ప్రజెంట్ ఈ సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉండేది మూవీ టీమ్. కానీ టీజర్ రిలీజ్ తరువాత పరిస్థితులు తారుమారు కావటంతో సినిమా రిలీజ్ కూడా వాయిదా పడింది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. డార్లింగ్ లిస్ట్‌లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ఆదిపురుష్. అన్ని అనుకున్నట్టుగా జరిగుంటే ప్రజెంట్ ఈ సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉండేది మూవీ టీమ్. కానీ టీజర్ రిలీజ్ తరువాత పరిస్థితులు తారుమారు కావటంతో సినిమా రిలీజ్ కూడా వాయిదా పడింది. టీజర్ మీద దారుణమైన ట్రోల్స్ వచ్చినా.. ఇప్పటికీ మోస్ట్ అవెయిటెడ్ లిస్ట్‌లో కొనసాగుతుంది ఆదిపురుష్. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమా చేస్తున్నారు ప్రభాస్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సలార్ సినిమా మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
కేజీఎఫ్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ మీద మాస్ హిస్టీరియా క్రియేట్ చేసిన ప్రశాంత్… ప్రభాస్ లాంటి పాన్ ఇండియా కటౌట్‌ను తెర మీద ఎలా చూపించబోతున్నారన్న క్యూరియాసిటీ ఆడియన్స్‌తో పాటు ఇండస్ట్రీ జనాల్లోనూ కనిపిస్తోంది. రిలీజ్‌కు ఇంకా చాలా టైమున్నా… డార్లింగ్ లిస్ట్‌లో ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేస్తున్న మరో క్రేజీ మూవీ ప్రాజెక్ట్ కే.
మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా 2024లో రిలీజ్‌కు రెడీ అవుతున్నా.. ఇప్పటి నుంచే ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేస్తోంది. వీటితో పాటే ప్రభాస్ మారుతి దర్శకత్వంలో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా హారర్ కామెడీ అని టాక్. తాజాగా ఈ సినిమా షూటింగ్ నుంచి ఓ ఫోటో లీక్ అయ్యింది. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటోలో ప్రభాస్ గడ్డం తో రఫ్ గా కనిపిస్తున్నారు. అలాగే ఈ ఫొటోలో హీరోయిన్ రిద్దికుమార్ కూడా ఉన్నారు. 
