Kalki 2898 Ad: బాక్సాఫీస్ కింగ్.. రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి సినిమా 5 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే..

|

Jul 02, 2024 | 10:51 AM

తొలి సోమవారం (జూలై 1) ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకుంది. కల్కి సినిమా సోమవారం ప్రపంచవ్యాప్తంగా రూ.84 కోట్లు వసూలు చేసింది. వారం రోజుల్లో రికార్డ్ స్థాయిలో కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ సినిమా మొత్తం రూ. 635 కోట్ల రూపాయలు వసూల్ చేసింది. దీని ద్వారా సినిమా ఈజీగా 1000 కోట్ల వరకు చేరుకుంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. 

Kalki 2898 Ad: బాక్సాఫీస్ కింగ్.. రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి సినిమా 5 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే..
Kalki 2898 Ad
Follow us on

‘కల్కి 2898 ఏడీ’ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రభాస్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సినిమా వారాంతంలో మంచి వసూళ్లు రాబట్టింది. తొలి సోమవారం (జూలై 1) ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకుంది. కల్కి సినిమా సోమవారం ప్రపంచవ్యాప్తంగా రూ.84 కోట్లు వసూలు చేసింది. వారం రోజుల్లో రికార్డ్ స్థాయిలో కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ సినిమా మొత్తం రూ. 635 కోట్ల రూపాయలు వసూల్ చేసింది. దీని ద్వారా సినిమా ఈజీగా 1000 కోట్ల వరకు చేరుకుంటుందని ఫ్యాన్స్ అంటున్నారు.

సోమవారం నాడు ‘కల్కి 2898 ఏడి’ సినిమా ఇండియాలో రూ.34.6 కోట్లు వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 45-50 కోట్ల రూపాయలు వసూల్ చేసింది ఈ సినిమా. దాంతో మొత్తంగా కల్కి సినిమా సోమవారానికి రూ. 635 కోట్ల రూపాయలు వసూల్ చేసింది. ‘కల్కి 2898 AD’ జూన్ 27న విడుదలైంది. ‘కల్కి 2898 AD’ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.191 కోట్లు రాబట్టింది.

దీంతో తొలిరోజు వసూళ్లలో ‘కేజీఎఫ్ 2’, ‘సలార్’, ‘లియో’ వంటి చిత్రాలను అధిగమించింది కల్కి సినిమా. ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 AD’లో  అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, కమల్ హాసన్ తదితరులు నటించారు. అలాగే ఆర్జీవీ, దుల్కర్‌ సల్మాన్‌తో పాటు పలువురు అతిథి పాత్రల్లో నటించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అశ్విని దత్  నిర్మాతగా వ్యవహరించారు. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. నాగ్ అశ్విన్ కల్కి సినిమాను మరిన్ని పార్టులుగా తెరకెక్కించనున్నారు. ఇప్పటికే పార్ట్ 2 షూటింగ్ 60 శాతం పూర్తయ్యిందని నిర్మాత అశ్విని దత్ తెలిపారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.