kalki 2898 AD: కల్కి యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్ చూశారా..? యమా క్రేజీగా ఉంది

|

May 30, 2024 | 6:37 PM

కల్కి సినిమాకోసం ఫ్యాన్స్ ఎంతలా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'కల్కి 2898 ఏడీ' చిత్రం జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా ఒకేసారి విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని పోస్టర్లు, టీజర్లు విడుదలై విశేష ఆదరణ పొందాయి. తాజాగా భైరవ, బుజ్జి టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇప్పుడు భైరవ, బుజ్జి యానిమేషన్ సిరీస్ ఓటీటీలోకి రానుంది.

kalki 2898 AD: కల్కి యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్ చూశారా..? యమా క్రేజీగా ఉంది
Kalki 2898 Ad
Follow us on

ఓటీటీల పుణ్యమా అని ప్రేక్షకులకు డబుల్ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. ప్రేక్షకులు ఎంటర్టైన్ అవ్వడానికి  డిజిటల్, OTT, పే పర్ వ్యూ, శాటిలైట్ ఇలా చాలా ఉన్నాయి. వీటితో పాటు ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసిన ‘ కల్కి 2898 AD ‘ టీమ్ ఈ సినిమా యానిమేషన్ సిరీస్‌ని ఓటీటీలో తీసుకురానుంది. దాంతో ఫ్యాన్స్ థ్రిల్ ఫీల్ అవుతున్నారు. కల్కి సినిమాకోసం ఫ్యాన్స్ ఎంతలా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా ఒకేసారి విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని పోస్టర్లు, టీజర్లు విడుదలై విశేష ఆదరణ పొందాయి. తాజాగా భైరవ, బుజ్జి టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇప్పుడు భైరవ, బుజ్జి యానిమేషన్ సిరీస్ ఓటీటీలోకి రానుంది.

‘కల్కి 2898 AD’ సినిమాలో ప్రభాస్ భైరవుడిగా నటించగా, భైరవుడికి తోడుగా బుజ్జి అనే చిన్నరోబో. ఈ ఇద్దరి కలిసి చేసే సందడి సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని అంటున్నారు. ఇప్పుడు వీరిద్దరి పై రూపొందిన యానిమేషన్ సిరీస్ మే 31న అంటే రేపు ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలవుతోంది. యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్ ను అమెజాన్ ప్రైమ్ షేర్ చేసింది.

ట్రైలర్‌లో బుజ్జి, భైరవ ప్రమాదకర మిషన్‌లలో పాల్గొనడం, విలన్‌లను తమ అధునాతన వాహనాలు, ఆయుధాలతో ముప్పుతిప్పలు పెట్టడం చూడొచ్చు. యానిమేషన్ చాలా క్రేజీగా ఉంది. అలాగే భైరవగా ప్రభాస్ పాత్రను బాగా డబ్బింగ్ చేశారు. యానిమేషన్ సిరీస్‌లో భైరవ పాత్రకు ప్రభాస్ స్వయంగా వాయిస్‌ని అందించాడు. బుజ్జి పాత్రకు నటి కీర్తి సురేష్ వాయిస్ ఇచ్చింది. ఈ సినిమాలోనూ.. బుజ్జి క్యారెక్టర్‌కి కీర్తి సురేష్ వాయిస్‌ని అందించింది. జూన్ 27న ‘కల్కి 2898 ఏడీ’ సినిమా విడుదల కానుంది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా ఉంటుంది. సినిమా మేకింగ్ హాలీవుడ్ సినిమాలను తలపిస్తుంది. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాస్, నాగ్ అశ్విన్ కథను అందించారు. ప్రభాస్‌తో పాటు దీపికా పదుకొణె, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కూడా నటిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.