Prabhas Workout : వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్న ప్రభాస్ ఆయా సినిమాల్లో యాక్షన్ ఎపిసోడ్‌ల కోసం తెగ కష్ట పడుతున్నాడు. జిమ్‌లో హైపవర్ వర్కౌవట్లతో.. క్యారెక్టర్ కు తగ్గ అప్పియరెన్స్‌లతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా కోసం భారీగా కథలు పెంచాడు డార్లింగ్ ప్రభాస్.. ఇప్పుడు మరో సినిమాకు ఆల్మోస్ట్ అదే రేంజ్‌లో కష్ట పడుతూ.. కండలు పెంచి మళ్లీ అందరినీ మెస్మరైజ్ చేసే పనిలో ఉన్నాడు.
అవును స్టార్ హీరో ప్రభాస్ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ప్రభాస్ శిక్షణ తీసుకుంటుంది సలార్ కోసం కాదు రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమా కోసం. అంతేకాకుండా ప్రభాస్ ఆదిపురుష్ సినిమా కోసం సరికొత్త భాషతో పాటుగా జిమ్‌లో తెగ కష్టం చేస్తున్నారంట. పాత్రకి సరిగ్గా సరిపోయే విధంగా శరీరాన్ని మలుచుకునేందుకు ప్రభాస్ కష్టపడుతున్నారని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా చిత్రీకరణ ముంబైలోని ఓ ప్రైవేట్ ఫిలిం స్టూడియోలో జరగనుంది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ లంకేశ్ పాత్రలో కనిపించనున్నారు. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ప్రభాస్ ఇతర నటీనటులు కూడా ప్రస్తుతం ఈ సినిమాలో వాడనున్న భాషను నేర్చుకుంటున్నారు. అతి త్వరలో ఈ సినిమా పట్టాలెక్కనుంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతోపాటు రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న రాధేశ్యామ్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు డార్లింగ్. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :
‘HIT’ Movie Sequel : విశ్వక్‌సేన్ ‘హిట్’ కు ఏడాది.. సీక్వెల్ అనౌన్స్ చేసిన నేచురల్ స్టార్..