
తెలుగు సినిమా ప్రపంచంలో విభిన్న కథలతో వరుస విజయాలను అందుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. హనుమాన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఆయన.. ఇప్పుడు సినిమాటిక్ యూనివర్స్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. తేజ సజ్జా నటించిన హను మాన్ మూవీతో ప్రారంభమైన ఈ యూనివర్స్.. ఇప్పుడు సరికొత్త చిత్రాలతో పాన్ ఇండియా సినీప్రియుల దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ క్రమంలోనే కన్నడ హీరో రిషబ్ సెట్టితో జై హనుమాన్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇదివరకు విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఈ సినిమా పై అంచనాలు పెరిగాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ పై మరోసారి హైప్ క్రియేట్ అయ్యింది. అందుకు కారణం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.
ఎక్కువమంది చదివినవి : Cinema : హీరో ముసలోడు అని కొనేవాడు రాలేదు.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లోకి ప్రభాస్ అడుగుపెట్టనున్నట్లు ప్రచారం జరుగుతుంది. సినీరంగంలో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న మహాకాళి సినిమాలో ప్రభాస్ అతిథి పాత్రలో కనిపించనున్నట్లు టాక్.ఇప్పటికే తన పాత్రకు సంబంధించిన షూటింగ్ ను డార్లింగ్ పూర్తి చేశారని టాక్. దీంతో ఆయన కనిపించబోయే పాత్ర ఏంటోనని అభిమానులు ఆరా తీస్తున్నారు.
ఎక్కువమంది చదివినవి : Tanikella Bharani: అలాంటి హీరోను నా జీవితంలో చూడలేదు.. ఆయన వల్లే నా జీవితం మారిపోయింది.. తనికెళ్ల భరణి..
మహాకాళి సినిమా ఇప్పటివరకు దాదాపు 100 రోజుల షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇందులో ధురంధర్ నటుడు అక్షయ్ ఖన్నా సైతం కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. పూజా అపర్ణ కొల్లూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మహిళా సూపర్ హీరో చిత్రంలో భూమి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ రచన చేయగా, ఆర్‌కేడీ స్టూడియోస్ బ్యానర్‌పై రివాజ్ రమేష్ దుగ్గల్ నిర్మించారు. స్మరణ్ సాయి సంగీతం అందించారు.
ఎక్కువమంది చదివినవి : Baahubali 2 : బాహుబలి 2లో నేను చేసిన సీన్స్ అన్నీ తీసేసారు.. అయినా ఫేమస్ అయ్యా.. టాలీవుడ్ నటుడు..
ఎక్కువమంది చదివినవి : Tollywood : మొన్నటిదాక తోపు సింగర్.. ఇప్పుడు స్పెషల్ పాటతో గ్లామర్ బీభత్సం.. ఎవరో గుర్తుపట్టారా.. ?