యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం రాధేశ్యామ్. దాదాపు రెండేళ్ల తర్వాత ప్రభాస్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో డైరెక్టర్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా.. ఈ సినిమా స్టోరీ.. ఓ రియల్ స్టోరీ అన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. 106 మంది ప్యాసింజర్లతో రోమ్‌కి బయలుదేరింది ఓ ట్రైన్. ఆ ట్రెయిన్ ఓ టన్నేలోకి వెళ్లి తిరిగి బయటకు రాలేదు. వినేందుకు కాస్త వింతగా ఉన్న ఈ రియల్ స్టోరీ ఓ మిస్టరీగానే నిలిచిపోయింది. అయితే ఈ స్టోరీ ఆధారంగానే రాధేశ్యామ్ సినిమా స్టోరీ తెరకెక్కిందని, సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అవుతున్నాయి.
అది 1911. ఇటలీలో 106 మంది ప్యాసింజర్లతో జనట్టి అనే ఒక ట్రైన్‌ను రోమ్‌కి బయలుదేరింది. లాంబార్టీ మౌంటెన్ వద్ద ఒక పెద్ద టన్నెల్ లోకి వెళ్ళిన ఈ ట్రైన్ ఇప్పటిదాకా బయటికి రాలేదు. ఆ ట్రైన్ ఏమైపోయిందో ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీనే. కేవలం ఆ ట్రైన్ మాత్రమే కాదు.. ఆ ట్రైన్‌లో ఉన్న 104 మంది పాసింజర్లు ఏమైపోయారు.? అన్న క్వశ్చన్‌కు సమాధానం దొరకలేదు. అయితే అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఈ 106 మంది ప్యాసింజర్లలో ఇద్దరు మాత్రం బతికి బయటపడ్డారు. ఇంతకీ.. ఈ ఇద్దరూ ఎలా బతికి బయటపడ్డారు.? వాళ్లు చెప్పిన ఆ షాకింగ్ విషయాలు ఏంటి.? అనేది ఈ స్టోరీ.
అయితే జనెట్టి ట్రైన్ అనేది ఓ పర్వత ప్రాంతం మధ్య నుంచి ఏర్పాటు చేసిన ఓ ట్రాక్‌పై వెళ్తుంది. అంతా అనుకున్నట్లుగానే ఆ లాంబర్టీ మౌంటెన్ రానే వచ్చింది. ఒక కిలోమీటర్ ఉన్న టన్నెల్‌లోకి వెళ్లింది జనెట్టి ట్రైన్. కానీ ఆ ట్రైన్ టన్నెల్‌లోకి అయితే వెళ్లింది కానీ.. మళ్లీ బయటకు మాత్రం రాలేదు. ఆ ట్రైన్ సొరంగంలోపలే మాయమైపోయింది. చాలా సేపటి వరకు గమ్యం చేరాల్సిన ట్రైన్ రాకపోవటంతో రైల్వే అధికారులు ఆ సోరంగంలో ఏదైన ప్రమాదం జరిగిఉండవచ్చని మొదట భావించారు. ఒక కిలోమీటర్ ఉన్న ఆ టన్నెల్‌లోపలికి వెళ్లి చూశారు… కానీ.. అక్కడ ఎలాంటి ప్రమాదం జరిగిన్నట్లు కనిపించలేదు. దీంతో ఆ ట్రైన్ ఎలా మాయం అయిపోయిందన్న వార్త విని ఇటలీతో పాటు ప్రపంచదేశాలు షాక్ అయ్యాయి.
ట్రైన్ మిస్సింగ్‌పై పోలీసులు, అధికారులు, ప్రజలు భయం భయంగా ఉన్న సమయంలోనే ఇద్దరు వ్యక్తులు భయంతో వణికిపోతూ పోలీసుల కంట పడ్డారు. వాళ్లిద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు… ఇంతకీ ఏమైందని, మీరు ఎవరు… ప్రశ్నించారు. ఇకవాళ్లు చెప్పిన సమాధానం ఏంటంటే.. మిస్సింగ్ ట్రైన్‌లో తామిద్దరం కూడా ప్రయాణిస్తున్నట్లు చెప్పారు..లాంబర్టీ టన్నెల్‌లోకి వెళ్లిన కాసేపటికే.. మొత్తం చీకటైపోయిందని, విచిత్రమైన శబ్దంతో తాము భయపడ్డామని చెప్పారు.. ఆ భయంతోనే ట్రైన్‌లో నుంచి బయటకు దూకామని చెప్పుకొచ్చారు. రన్నింగ్ ట్రైన్‌లో నుంచి మేం ఇద్దరం దూకడంతో తలకు గాయాలైనట్లు చూపించారు… ఇక అప్పటికే ట్రైన్ మిస్సింగ్‌తోనే తలలు పట్టుకున్న పోలీసులు, అధికారులు.. వీళ్లిద్దరూ చెప్పిన ఈ షాకింగ్ విషయాలు విని మరింత భయపడిపోయారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ఉండేందుకు వెంటనే ఆ సొరంగాన్ని మూసేశారు ఇటలీ అధికారులు. ఇక ఎన్ని ప్రయత్నాలు చేసిన ఆ ట్రైన్ గురించి ఏ ఒక్క క్లూ కూడా కనిపించకపోవడంతో.. ఆ ట్రైన్, ట్రైన్‌లోని ప్యాసింజర్లపై ఆశలు వదులుకున్నారు.
సీన్ కట్ చేస్తే.. మళ్లీ 1926లో… అంటే సరిగ్గా 15ఏళ్ల తర్వాత జనెట్టి ట్రైన్‌కు సంబంధించిన వార్త కేవలం ఇటలీనే కాదు యావత్ ప్రపంచాన్ని మరోసారి షాక్‌కు గురి చేసింది. 1911లో లాంబర్టీ సొరంగంలోకి వెళ్లి మళ్లి కనిపించకుండా పోయిన జనట్టి ట్రైన్, మెక్సికోలో కనిపించింది. అవును మీరు విన్నది నిజమే.. మెక్సికోలోని ఓ రైల్వేఫ్లాట్‌ఫామ్ మీదకు రావడం మాత్రమే కాదు.. వాళ్ల దుస్తులు, వాళ్లు మాట్లాడే తీరును చూసి అక్కడి అధికారులే ఆశ్చర్యపోయారు… అయితే అసలు వీళ్లు ఎవరు అని ప్రశ్నించగా.. ఆ 104 మంది, జెనట్టి ప్యాసింజర్లు చెప్పిందంతా ఒక్కటే.. రోమ్ నగరంలోని జెనట్టి ట్రైన్ ఎక్కామని, ఈ ట్రైనే తమను ఇక్కడికి తీసుకొచ్చిందని చెప్పారు. అయితే ఇదంతా నమ్మశక్యంగా లేకపోవడంతో.. వీళ్లందరికీ పిచ్చి పట్టిందని భావించిన మెక్సికో అధికారులు.. వాళ్లందరినీ ఓ ఆస్పత్రికి తరలించి..అబ్షర్వేషన్‌లో ఉంచారు..ఎప్పటికప్పుడు వారి… మెంటల్ ఎబిలిటీని పరిశీలించారు..
కానీ.. ఇక్కడ మరో షాకింగ్ ఇన్సిడెంట్ ఏంటంటే.. ఆస్పత్రిలో ఉంచిన కొద్ది గంటలకే వాళ్లు అక్కడి నుంచి మాయం అయ్యారు. ఈ రియల్ మిస్టరీ ఇలాగే మిగిలిపోయింది. అయితే ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం రాధేశ్యాం చిత్రం ఈ కథ ఆధారంగానే తీస్తున్నారన్న వార్తలు చాలా వైరల్ అవుతున్నాయి. కానీ ఇందులో నిజం ఏంతా అన్నది ఇంకా తెలియలేదు. కానీ.. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ పోస్టర్ వంటి వాటిలో జెనట్టి ట్రైన్ మిస్టరీకి సంబంధించిన చాలా విషయాలు పోలి ఉండటంతో ఇది ఆ స్టోరే అని అనుకుంటున్నారు కొందరు నెటిజన్స్.
Also Read: Radhe Shyam Trailer: ప్రాణం పోసే ప్రేమ ప్రాణం తీయగలదా.. రాధేశ్యామ్ ట్రైలర్ అదుర్స్..
Thaggedhe Le: ‘తగ్గేదే లే’ డైలాగ్ చెప్పిన క్రికెటర్ జడేజా.. పుష్ప ఫీవర్ మాములుగా లేదుగా..
Pushpa: యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన శ్రీవల్లి సాంగ్.. 100 మిలియన్ల వ్యూస్‌ను దాటేసి..