Radhe Shyam: రాధేశ్యామ్ టైటిల్ అందుకే మార్చారా ?.. ప్రభాస్ చెప్పినందుకే డైరెక్టర్ ఈ నిర్ణయం.. నెట్టింట్లో వార్తలు హల్చల్..

|

Feb 07, 2022 | 5:21 PM

మోస్ట్ అవైయిటెడ్ చిత్రం రాధేశ్యామ్. సాహో సినిమా అనంతరం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న

Radhe Shyam: రాధేశ్యామ్ టైటిల్ అందుకే మార్చారా ?.. ప్రభాస్ చెప్పినందుకే డైరెక్టర్ ఈ నిర్ణయం.. నెట్టింట్లో వార్తలు హల్చల్..
Follow us on

మోస్ట్ అవైయిటెడ్ చిత్రం రాధేశ్యామ్ (Radhe Shyam). సాహో సినిమా అనంతరం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‏గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ మూవీపై ఇంటెన్సిటీని క్రియేట్ చేశాయి. ఇక రాధేశ్యామ్ ట్రైలర్ విడుదలైన క్షణాల్లోనే యూట్యూబ్‍లో సంచలనం సృష్టించింది. దాదాపు రెండేళ్ల తర్వాత ప్రభాస్ నుంచి అందమైన ప్రేమకథ రాబోతుండడంతో రాధేశ్యామ్ చిత్రాన్ని చూసేందుకు డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ క్రమంలోనే ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన చిత్రయూనిట్.. ఆ తర్వాత కరోనా ప్రభావంతో వెనక్కు తగ్గింది. వేసవిలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదిలా ఉంటే.. రాధేశ్యామ్ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. రాధేశ్యామ్ సినిమాపై ప్రభాస్ చాలా శ్రద్ధ తీసుకుంటున్నాడట. ఈ సినిమాలో ప్రభాస్ సూచనల మేరకు కొన్ని మార్పులు కూడా చేశారట. నిజానికి రాధేశ్యామ్ సినిమా టైటిల్ ముందుగా మైరి జాన్ అని పెట్టారట. అందులో మేరి అనే పదాలు చిన్నగా.. జాన్ అనే పదాలు పెద్దగా ఉండేలా ప్లాన్ చేశారట. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో టాలెంటెడ్ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో ప్రొడ్యూసర్ దిల్ రాజు 96 చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేశారు. ఈ సినిమాను తెలుగులో జాను అనే టైటిల్ తో విడుదల చేశారు. అయితే తన స్నేహితుడు శర్వానంద్ కోసం ప్రభాస్ తన సినిమా టైటిల్ మార్చుకున్నారట. దీంతో మేరీ జాన్ కాకుండా.. రాధేశ్యామ్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా ఫిల్మ్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. వింటేజ్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్, ప్రశీద నిర్మిస్తున్నారు.

Also Read: Lata Mangeshkar: రాజ్‌కపూర్‌పై అలిగిన లతా మంగేష్కర్.. ఎందుకు అలా చేసిందంటే..

Lata Mangeshkar: అసంపూర్ణంగా మిగిలిపోయిన ప్రేమ వాళ్లది.. లతా మంగేష్కర్ ప్రేమ ద్వేషంగా ఎందుకు మారిందో తెలుసా..

Pawan Kalyan-Statue of Equality: సమతామూర్తి భగవద్ రామానుజాచార్య సన్నిధిలో ‘పవన్ కళ్యాణ్’.. చినజీయర్ స్వామి ఆశీర్వాదం తీసుకున్న ‘జనసేనని’ ఫొటోస్..

Shruti Haasan: పచ్చని ప్రకృతి నడుమ ఫోటోలకు ఫోజులిచ్చిన ‘శ్రుతి హాసన్’ సొగసులు చూడతరమా..(ఫొటోస్)