మహాశివరాత్రి వేళ ప్రభాస్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు ప్రాజెక్ట్ కె మేకర్స్. ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ ఇంట్రెస్టింగ్ పోస్టర్ విడుదల చేశారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్ సినిమాపై మరింత క్యూరియాసిటిని పెంచేసింది. అందులో ఓ ఎడారిలో ఓ భారీ చేతిని స్నిపర్స్ జాగ్రత్తగా చూస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నారు.
యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇటీవల దీపికా పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. ఈ పోస్టర్‌లో బ్యాక్‌గ్రౌండ్‌లో అస్తమిస్తున్న సూర్యుడితో దీపిక ఒక రాక్‌పై నిలబడి ఉన్న సిల్హౌట్‌ను ధరించి ఉంది. మొత్తానికి ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ కె రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.
ఈ సినిమానే కాకుండా ప్రభాస్ చేతిలో మరో నాలుగు చిత్రాలు ఉన్నాయి. అందులో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ చిత్రం ఒకటి కాగా.. మరోకటి డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్న సినిమా. అలాగే డైరెక్ట్ర ఓం రౌత్ కాంబోలో తెరకెక్కిన ఆదిపురుష్ విడుదలకు సిద్ధంగా ఉంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.