Adipurush: దుమ్మురేపుతోన్న ప్రభాస్ ఆదిపురుష్.. తొలిరోజే నయా రికార్డు

|

Jun 17, 2023 | 12:42 PM

రామాయణ ఇతిహాసం ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరక్కించిన ఈ దృశ్యకావ్యం వీక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా తొలి రోజు భారీ వసూళ్లను రాబట్టింది తెలుస్తోంది. ట్రేడ్ వర్గాల ప్రకారం ఆదిపురుష్ సినిమా తొలి రోజు 150 కోట్లకు పైగా వసూల్ చేసిందని తెలుస్తోంది.

Adipurush: దుమ్మురేపుతోన్న ప్రభాస్ ఆదిపురుష్.. తొలిరోజే నయా రికార్డు
Adipurush
Follow us on

ప్రభాస్ ఆదిపురుష్ నిన్న (జూన్ 16)న ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 7000 థియేటర్స్ లో విడుదల అయ్యింది. ఇక ఈ సినిమాకు అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. మొదటి రోజే ఈ సినిమా రికార్డులను కొల్లగొట్టింది తెలుస్తోంది. రామాయణ ఇతిహాసం ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరక్కించిన ఈ దృశ్యకావ్యం వీక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా తొలి రోజు భారీ వసూళ్లను రాబట్టింది తెలుస్తోంది. ట్రేడ్ వర్గాల ప్రకారం ఆదిపురుష్ సినిమా తొలి రోజు 150 కోట్లకు పైగా వసూల్ చేసిందని తెలుస్తోంది. కృతిసనన్ సీత పాత్రలో నటించిన ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి గ్రాస్ ను రాబట్టింది తెలుస్తోంది. ప్రభాస్ గత చిత్రాలతో పోల్చుకుంటే ఈ సినిమా భారీగా వసూళ్లను రాబట్టి రికార్డును క్రియేట్ చేసింది.

బాహుబలి, సాహో సినిమాల కంటే ఆదుపురుష్ ఎక్కువగా కలెక్ట్ చేసిందని తెలుస్తోంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఆదిపురుష్ సినిమా 150కోట్లకు పైగా గ్రాస్ ను రాబట్టింది సమాచారం. ఇప్పటికే అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా ఉన్న పఠాన్ మూవీ రికార్డును ఆదిపురుష్ బ్రేక్ చేసిందని తెలుస్తోంది.

హిందీలో ఆదిపురుష్ సినిమా తొలి రోజు 30 కోట్లు వసూల్ చేసిందని టాక్. అలాగే తెలుగురాష్ట్రాల్లో ఈ చిత్రం 80 కోట్ల వరకు వసూల్ చేసింది. నైజం లో 50 కోట్లు, ఈస్ట్ 8 కోట్లు, వెస్ట్ 7 కోట్లు, కృష్ణా 7.5 కోట్లు, గుంటూరు 9 కోట్లు, విశాఖ పట్నం 12.5 కోట్లు, నెల్లూరు 4 కోట్లు, సీడెడ్ 17.5 కోట్లు వసూల్ చేసిందని ప్రచారం జరుగుతోంది. అలాగే అమెరికాలో 1 మిలియన్‌ ప్లస్ యూఎస్ డాలర్ల గ్రాస్ ను వసూల్ చేసి ప్రభాస్ ఆదిపురుష్ సినిమా సరికొత్త రికార్డును తన ఖాతలో వేసుకుంది