నేచురల్ స్టార్ నాని(Nani) హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అంటే సుందరానికి(Ante Sundaraniki), వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో తొలిసారి తెలుగులోకి అడుగుపెడుతుంది మలయాళీ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రయూనిట్ స్పెషల్ ప్రమోషనల్ కంటెంట్‌తో సందడి చేస్తోంది. వివేక్ సాగర్ స్వరపరిచిన ఈ చిత్రంలోని ఫస్ట్ సింగల్ పంచెకట్టు, సెకెండ్ సింగల్ ఎంత చిత్రం పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. రీసెంట్ గా ప్రమోషన్ సాంగ్ ను కూడా రిలీజ్ చేశారు. జూన్ 10న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు చిత్రయూనిట్. ఈ క్రమంలో అంటే సుందరని మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ గా గ్రాండ్ గా నిర్వహించనున్నారు.
అంటే సుందరానికి ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ఈ ఈవెంట్ ను హైదరాబాద్ లో జూన్ 9న నిర్వహించనున్నారని హీరో నాని ట్వీట్ చేశారు. నాని ఈవెంట్ కు పవర్ స్టార్ గెస్ట్ గా వస్తుండటం తో నాని అభిమానులు, పవన్ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన అంటే సుందరానికి మూవీ పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై మరింత ఆసక్తిని కలిగించాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ కు భారీ స్పందన వచ్చింది. సందరం పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపించి అలరించారు నాని. ఈ చిత్రంలో నాని సుందర్ అనే బ్రాహ్మణ అబ్బాయి పాత్రలో నటిస్తుండగా, నజ్రియా క్రిస్టియన్ అమ్మాయి లీలాగా కనిపించనున్న సంగతి తెలిసిందే..
Pawan kalyan for Sundar prasad ♥️
Thank you sir @PawanKalyan .#AnteSundaraniki team and I are thrilled ??
Looking forward to the pre release event on 9th :))— Nani (@NameisNani) June 7, 2022