Pawan Kalyan: పవర్ స్టార్ సాయిధరమ్ తేజ్ బ్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగేది అక్కడేనా..?

|

Jun 26, 2023 | 7:59 AM

వారాహి యాత్రతో ఆయన రాష్ట్రమంతా తిరుగుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే .. హరిహరవీరమల్లు అనే పిరియాడికల్ డ్రామా తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు . ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ వేగంగా జరుగుతోంది.

Pawan Kalyan: పవర్ స్టార్ సాయిధరమ్ తేజ్ బ్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగేది అక్కడేనా..?
Bro
Follow us on

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  లైనప్ చేసిన సినిమాలతో ఫ్యాన్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఓ వైపు రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్.. ఏపీ లో పర్యటిస్తున్నారు. వారాహి యాత్రతో ఆయన రాష్ట్రమంతా తిరుగుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే .. హరిహరవీరమల్లు అనే పిరియాడికల్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ వేగంగా జరుగుతోంది. ఈ సినిమాతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా చేస్తున్నారు. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత హరీష్ శంకర్ పవన్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా లో కూడా పవన్ గబ్బర్ సింగ్ మాదిరి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు.

అలాగే మెగా మేనల్లు సాయిధరమ్ తేజ్ తో కలిసి బ్రో అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సముద్ర ఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడిగా కనిపించనున్నారట. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ దాదాపు చివరిదశకు వచ్చేసిందని తెలుస్తోంది.

అలాగే ఈసినిమా ప్రమోషన్స్ కూడా షురూ చేయనున్నారట . ఈ క్రమంలోనే బ్రో మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఇద్దరు మెగా హీరోలు కలిసి నటిస్తున్నారు కాబట్టి ఓ భారీ వేదికను ఏర్పాటు చేసి ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఈ వేడుక రాజమండ్రిలో జరగనుందని టాక్ వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ చేస్తోన్న వారాహి యాత్ర అటు వైపే ఉండటంతో అక్కడే ఈ ఈవెంట్ ని నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే దీని పై అప్డేట్ ఇవ్వనున్నారు మేకర్స్. ఈ సినిమాతో పాటే సుజిత్ డైరెక్షన్ లో ఓజీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.