Bhima Nayak : పవన్ కళ్యాణ్ ‘భీమ్లానాయక్’ నుంచి రానా టీజర్.. ప్రేక్షకుల ముందుకు ఎప్పుడంటే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైనప్ చేసిన సినిమాల్లో భీమ్లానాయక్ సినిమా ఒకటి. ఈ సినిమా కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Bhima Nayak : పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్ నుంచి రానా టీజర్.. ప్రేక్షకుల ముందుకు ఎప్పుడంటే..
Rana .

Updated on: Sep 18, 2021 | 7:54 AM

Bhima Nayak : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైనప్ చేసిన సినిమాల్లో భీమ్లానాయక్ సినిమా ఒకటి. ఈ సినిమా కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక వకీల్‌ సాబ్‌ బొనాంజాతో పవన్‌ సెకండ్‌ ఫేజ్‌.. సక్సస్‌ ఫుల్‌‌‌‌గా సాగుతోంది. ఇప్పటికే యంగ్‌ డైరెక్టర్లతో వరుసగా సినిమాలు లైన్లో పెట్టిన పవన్‌.. వాటన్నింటిని సూపర్‌ ఫాస్ట్‌‌‌‌గా కంప్లీట్‌ చేసేందుకు ట్రై చేస్తున్నారు. ట్రై చేయడమే కాదు.. హరి హర వీరమల్లు వంటి పీరియాడికల్ కథతో సరికొత్తగా వస్తున్నారు. వకీల్ సాబ్‌ను ఇంకా మరవక ముందే.. భీమ్లా నాయక్‌గా వచ్చేస్తున్నారు పవన్‌. తనకే సెట్ అయ్యే ఖాకీ డ్రెస్సులో… తనకు క్రేజ్‌ తెచ్చిపెట్టిన పోలీసు గన్నుతో.. గబ్బర్‌ సింగ్‌ కామెడీ పోలీస్‌లా కాకుండా… స్ట్రిక్ట్ పోలీస్‌ భీమ్లా నాయక్‌లా.. మన ముందుకు రాబోతున్నారు.

ఇప్పటికే పవన్ కళ్యాణ్ పాత్ర భీమ్లా నాయక్ టీజర్..లుక్‌కి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. పవన్ మాస్ లుక్‌కు అభిమానులంతా ఫిదా అయ్యారు. ఇక ఇప్పుడు రానా వంతు వచ్చింది. బీమ్లా నాయక్ సినిమా నుంచి దగ్గుబాటి హీరో టీజర్ రెడీ అవుతుంది. `బ్లిట్జ్ ఆఫ్ డేనియల్ శేఖర్`ని సెప్టెంబర్ 20న రిలీజ్ చేస్తున్నట్లు యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో డేనియల్ శేఖర్ తెల్ల లుంగీ కట్టుకుని కనిపించాడు. ఓ చెత్తో లుంగీ పట్టుకుని ..మరో చేత్తో పిడికిలి బిగించి పవర్ ఫుల్‌గా కనిపించాడు రానా. ఇక ఈ సినిమాకు సితార ఎంటర్ టైన్ మెంట్స్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు రచిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pooja Hegde: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‏తో షూరు చేసిన బుట్టుబొమ్మ.. ఇకపై సొంత గళాన్ని వినిపించనున్న పూజా హెగ్డే..

Bandla Ganesh: ఆసక్తికరంగా బండ్ల గణేష్ సినిమా టైటిల్.. మూవీ పేరు ఏంటో తెలుసా ..

Bigg Boss 5 Telugu: నీకు తగిన శాస్తి జరిగిందన్న ప్రియా.. కన్నీళ్లు పెట్టుకున్న కాజల్..