Bheemla Nayak: భీమ్లానాయక్ నుంచి నాలుగో సింగిల్.. ఆకట్టుకుంటున్న ‘అడవి తల్లి మాట’.. పాట

|

Dec 04, 2021 | 10:09 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి హీరో రానా కలిసి నటిస్తున్న సినిమా భీమ్లానాయక్.. ఈసినిమా కోసం పవన్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

Bheemla Nayak: భీమ్లానాయక్ నుంచి నాలుగో సింగిల్.. ఆకట్టుకుంటున్న అడవి తల్లి మాట.. పాట
Follow us on

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి హీరో రానా కలిసి నటిస్తున్న సినిమా భీమ్లానాయక్.. ఈసినిమా కోసం పవన్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మలయాళం లో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు రీమేక్ గా వస్తుంది ఈ సినిమా. ఈ సినిమానుంచి ఇప్పటికే విడుదలైన ఏ చిన్న అప్డేట్ అయ్యిన అది క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్, గ్లిమ్ప్స్, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు నాలుగో సింగిల్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. భీమ్లానాయక్ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందించారు.

ఈ సినిమా టైటిల్ సాంగ్.. అంత ఇష్టమేందయ్యా .. భీమ్లా నాయక్ అంటూ సాగే పవన్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్నాయి. తాజాగా విడుదల చేసిన నాలుగో పాట అడవి తల్లి మాట అంటూ సాగే ఈ పాట కూడా ఆకట్టుకుంటుంది. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ రచించారు. ఈ సినిమా పవర్ స్టార్ సరసన నిత్యామీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే రానాకు జోడీగా మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ కనిపించనుంది. ప్రముఖ నటులు, రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, నర్రా శ్రీను , కాదంబరికిరణ్, చిట్టి, పమ్మి సాయి, చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం పవర్ స్టార్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Allu Arjun: పుష్పరాజ్‏కు స్పెషల్ గిఫ్ట్ పంపిన శ్రీవల్లి.. థ్యాంక్స్ చెప్పిన బన్నీ.. ఏం పంపిందంటే..

Pooja Hegde: రాధేశ్యామ్ కోసం ప్రేరణ డబ్బింగ్ పూర్తిచేసిన పూజా హెగ్డే.. ఫోటో వైరల్..

Fact Check: రామ్ గోపాల్ వర్మ చెప్పిన ఒమిక్రాన్ సినిమా ఉందా? అసలు ఆ పోస్టర్ నిజమైనదేనా?