పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా రెండు సూపర్ హిట్స్ కొట్టి ఇప్పుడు హ్యాట్రిక్ కోసం రెడీగా ఉన్నారు. రీఎంట్రీ తర్వాత వకీల్ సాబ్, భీమ్లానాయక్ సినిమాలతో హిట్స్ అందుకున్నారు పవన్. ఇక ఇప్పుడు మరో సూపర్ హిట్ ను రెడీ చేస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. హరిహరవీరమల్లు(Hari Hara Veera Mallu) అనే హిస్టారికల్ సినిమా చేస్తున్న పవన్. పవన్ కెరీర్ లోనే ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ప్రియాడికల్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పవన్ బందిపోటుగా కనిపించనున్నాడని మొదటి నుంచి టాక్ వినిపిస్తుంది. మొగలాయిలా కాలం నాటి కథతో రూపొందుతూన్న ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చిన అది క్షణాల్లో వైరల్ అవుతోంది.
ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే 60శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఇటీవలే మరో షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్లో పవన్ పై భారీ యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించినట్టుగా తెలుస్తుంది. మే 2వ వారం నుంచి మరో షెడ్యూల్ ను ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. జూన్ నెలతో ఈ సినిమా షూటింగు పార్టును పూర్తిచేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాలో అర్జున్ రాంపాల్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలు హిట్ అవ్వడంతో వీరమల్లుతో పవన్ హ్యాట్రిక్ హిట్ అందుకోవాలని అభిమానులంతా భావిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :