భీమ్లా నాయక్(Bheemla Nayak) సూపర్ హిట్ అయినా ఆ సక్సెస్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేయలేకపోతున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. ఈ సినిమాతో పవన్ నార్త్ ఎంట్రీ ఇస్తారంటూ ఊరించిన మేకర్స్.. డేట్ విషయంలో క్లారిటీ ఇవ్వకపోవటంపై టెన్షన్ పడుతున్నారు. పవర్ స్టార్ నార్త్ డెబ్యూ విషయంలో ఇంత డిలే ఎందుకు..? అసలు భీమ్లా బాలీవుడ్ రిలీజ్ ఉంటుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భీమ్లానాయక్ రిలీజ్‌కు ముందే ఆ సినిమాను హిందీలోనూ రిలీజ్ చేస్తామని ఎనౌన్స్ చేశారు నిర్మాత నాగవంశీ. దీంతో రెండు వర్షన్స్ ప్యారలల్‌గానే రిలీజ్ అవుతాయని భావించారు. కానీ తెలుగు వర్షన్‌తో పాటు హిందీ వర్షన్ రిలీజ్ కాలేదు. టాలీవుడ్‌లో సక్సెస్ అయిన తరువాత కాస్త ఆలస్యంగా హిందీ ట్రైలర్ విడుదల చేసినా.. రిలీజ్ డేట్ ఎప్పుడన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు ఆహాలో రిలీజైన భీమ్లానాయక్ మరోసారి టాప్‌లో ట్రెండ్ అవుతోంది. దీంతో నార్త్ రిలీజ్ ఎప్పుడన్న టాపిక్ మళ్లీ తెర మీదకు వచ్చింది.
తాజాగా పవన్ నార్త్ డెబ్యూ వాయిదా పడిందన్న టాక్ వినిపిస్తోంది. భీమ్లా నాయక్ హిందీలో రిలీజ్‌ను చేయాలన్న ప్రపోజల్‌ని మేకర్స్ వెనక్కు తీసుకున్నారన్నది ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తున్న నయా అప్‌డేట్. ఆల్రెడీ సినిమా డిజిటల్‌లో కూడా వచ్చేయటంతో.. థియేట్రికల్ రిలీజ్‌కు అంత రెస్పాన్స్ ఉండకపోవచ్చన్న ఆలోచనలో ఉన్నారట మేకర్స్. అందుకే డైరెక్ట్‌గా డిజిటల్ రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందన్న చర్చ కూడా జరుగుతోందట. మరి ఈ విషయంలో ఫైనల్‌గా ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో అలవైకుంఠపురములో విషయంలో కూడా ఇలాగే జరిగింది. పుష్ప సూపర్ హిట్ కావటంతో అదే వేడి మీద అల వైకుంఠపురమలో సినిమాను యాజిటీజ్‌గా డబ్ చేసి రిలీజ్ చేయాలని డిమాండ్లు వినిపించాయి. డబ్బింగ్ వర్షన్‌ను రిలీజ్‌కు రెడీ చేశారు కూడా . కానీ రీమేక్ ప్రొడ్యూసర్స్ ఆర్గ్యూ చెయ్యడంతో ఆ సినిమాను కూడా ఆఖరికి డిజిటల్‌లోనే రిలీజ్ చేశారు. సూపర్ హిట్ అయిన రీజినల్ సినిమాలు నార్త్ రిలీజ్‌ల విషయంలో ఇబ్బందులు పడుతుండటంపై ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.