సినిమా సెలబ్రిటీలు ప్రేమలో పడటం, పెళ్లి చేసుకునేవారు చాలా మంది ఉన్నారు. అలాగే ప్రేమ తర్వాత బ్రేకప్ చెప్పుకున్నవారు ఉన్నారు. పెళ్లైన తర్వాత విడాకులు తీసుకున్న వారు చాలామందే ఉన్నారు. అయితే సినిమా వాళ్లు బ్రేకప్ ను అంత సీరియస్ గా తీసుకోరు. కొంతమంది డిప్రషన్ లోకి వెళ్లి ఆ తర్వాత బయటపడతారు. అలాగే ఇంకొంతమంది మాత్రం వెంటనే మరొకరితో ప్రేమలో పడటం, వేరొకరిని పెళ్లి చేసుకోవడంలాంటివి చేస్తుంటారు. బయట మాత్రం ఇలా ఉండదు క్షణికావేశంలో ప్రేమించిన వారిని దారుణంగా హతమార్చిన సంఘటనలు చాలానే ఉన్నాయి. పేమించిన అమ్మాయిని చంపిన వారు చాలా మంది ఉన్నారు. తాజాగా ఓ నటుడు కూడా తాను ప్రేమించిన అమ్మాయిని దారుణంగా చంపాడు.
తాజాగా హాలీవుడ్ నటుడు చేసిన పై ఇప్పుడు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్నాయి. హాలీవుడ్ నటుడు నిక్ పాస్క్వల్ తన మాజీ ప్రేయసిని దారుణంగా పొడిచి చంపాడు. హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ అల్లీ షెహర్న్ ను నిక్ పాస్క్వల్ ప్రేమించాడు. ఈ ఇద్దరూ చాలాకాలం ప్రేమలో ఉన్నారు. అంతే కాదు సహజీవనం కూడా చేశారు. అయితే ఏమైందో ఏమో కానీ ఈ ఇద్దరూ సడన్ గా విడిపోయారు.
నిక్ పాస్క్వల్.. అల్లీ షెహార్న్ ఇంటికి వెళ్లి మరీ ఆమెను హతమార్చాడు. కత్తితో 20 సార్లు విచక్షణారహితంగా పొడిచి హత్యాయత్నం చేశాడు నిక్ పాస్క్వల్. ఆమెను హతమార్చిన తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. ఆతర్వాత పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే పారిపోయే క్రమంలో మరికొంతమంది పై కూడా అతను దాడి చేశాడట. నేరారోపణలు రుజువు అయితే నిక్ పాస్క్వల్ జీవిత ఖైదు పడే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఈ న్యూస్ హాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.