Maa Elections 2021: హోరాహోరీగా ఎన్నికలప్రచారాలు.. సీన్లోకి హీరోయిన్ పూనమ్ కౌర్.. అన్నీ విషయాలు బయటపెడతానంటూ..

|

Oct 02, 2021 | 4:43 PM

మా ఎన్నికల సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఇప్పటికే ప్రకాష్ రాజ్ ప్యానల్ అలాగే మంచు విష్ణు ప్యానల్‌కు మధ్య హోరాహోరీగా ఎన్నికలప్రచారం జరుగుతున్నాయి..

Maa Elections 2021: హోరాహోరీగా ఎన్నికలప్రచారాలు.. సీన్లోకి హీరోయిన్ పూనమ్ కౌర్.. అన్నీ విషయాలు బయటపెడతానంటూ..
Poonam
Follow us on

Maa Elections 2021: మా ఎన్నికల సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఇప్పటికే ప్రకాష్ రాజ్ ప్యానల్ అలాగే మంచు విష్ణు ప్యానల్‌కు మధ్య హోరాహోరీగా ఎన్నికలప్రచారం జరుగుతున్నాయి.. ఇప్పటికే ప్రచారాన్ని మొదలు పెట్టిన ప్రకాష్ రాజ్ మంచు విష్ణు ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తుకుంటూ మాటల యుద్దానికి దిగుతున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్‌‌‌లు జరుగుతున్నాయి. ముందుగా ప్రకాష్ రాజ్ ప్యానల్‌లో ఉన్న బండ్లగణేష్ అనూహ్యంగా బయటకు వచ్చి జీవితపైన పోటీచేస్తా.. అని రచ్చ చేశారు.. చివరకు పోటీనుంచి తప్పుకొని తన మద్దతు ప్రకాష్ రాజ్‌‌కే  అని స్పష్టం చేశారు.. ఆ తర్వాత ఊహించని పరిణామాల మధ్య తాజాగా మరో అభ్యర్థి నటుడు సీవీఎల్ సైతం మా అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు.

ఈ సందర్భంగా సీవీఎల్ మాట్లాడుతూ.. నేను మా ఎన్నికల్లో ప్రెసిడెంట్ పదవికి పోటీలో నామినేషన్ వేశాను. ఇప్పుడు నామినేషన్ ఉపసంహరించుకున్నాను. అన్ని వివరాలు రెండు రోజుల్లో మీడియా వారికి చెపుతాను. ఉదయం కూడా నా మానిఫెస్టోను ప్రకటించాను. నేను నామినేషన్ ఉపసంహరించడానికి కారణం వుంది. అధ్యక్ష పదవి కంటే నాకు మా సభ్యుల సంక్షేమం ముఖ్యం అని అన్నారు. ఇదిలా ఉంటే నటి పూనమ్ కౌర్ ఎంట్రీ ఇచ్చారు. తాను ప్రకాష్ రాజ్ గెలవాలని కోరుకుంటున్నాని.. తన పూర్తిమద్దతు ఆయనకే అని తెలిపారు. అలాగే ‘మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ సార్ గెలవాలని నేను కోరుకుంటున్నాను. ఆయన విజయం సాధిస్తే ఇంతకాలం నేను మౌనంగా నేను ఎదుర్కొన్న సమస్యలను బయటపెడతాను. ఆయన మాత్రమే నిజాయితీగా ఉంటాడు.. పెద్దల పట్ల గౌరవంతో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారు ప్రకాష్ రాజ్… జైహింద్’ అని పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Kondapolam: వివాదంలో వైష్ణవ్ తేజ్ కొండపొలం సినిమా.. హీరో పేరును తప్పుబడుతూ..

Ravi Teja: జోష్‌ మీదున్న మాస్‌ మహా రాజా… మరో ప్రాజెక్ట్‌ ప్రకటన. ఒకేసారి మూడు సినిమాలతో..

Maa Elections 2021: ఉదయాన్నే మేనిఫెస్టో ప్రకటన.. అనుహ్యంగా ఎన్నికల నుంచి తప్పుకున్న సీవీఎల్..