Poonam kaur : డబ్బుతో బలహీనమైన పురుషులను ఈజీగా కొనవచ్చు.. పూనమ్ కౌర్ సంచలన పోస్ట్..

సమంత రెండో పెళ్లిపై పూనమ్ కౌర్ పరోక్షంగా చేసిన విమర్శలు చర్చనీయాంశంగా మారాయి. సొంత గూడు కట్టుకోవడానికి మరొకరి ఇంటిని కూల్చేయడం బాధాకరమని ఆమె ఎక్స్‌ పోస్ట్‌లో వ్యాఖ్యానించారు. పూర్తిగా స్వార్థపరమైన మహిళను పెయిడ్ పీఆర్‌ ప్రచారాలతో గొప్పదానిగా చూపిస్తున్నారని మండిపడ్డారు.

Poonam kaur : డబ్బుతో బలహీనమైన పురుషులను ఈజీగా కొనవచ్చు.. పూనమ్ కౌర్ సంచలన పోస్ట్..
Samantha - Poonam Kaur

Updated on: Dec 01, 2025 | 6:10 PM

సమంత పెళ్లిపై పూనమ్ పరోక్ష విమర్శలు చేసినట్లుగా ఆమె సోషల్ మీడియా పోస్ట్‌ను బట్టి అర్థమవుతుంది.  సొంత గూడు కట్టుకోవడానికి మరొకరి ఇంటిని పడగొట్టడం బాధాకరం ఆమె పేర్కొన్నారు. పూర్తిగా స్వార్థపరమైన మహిళను.. పెయిడ్ పీఆర్‌ ప్రచారాలతో గొప్పవారిగా చూపిస్తున్నారని ఆమె ఎక్స్‌లోని పోస్ట్‌లో రాసుకొచ్చారు. డబ్బుతో బలహీనమైన, నిరాశలో ఉన్న పురుషులను సులభంగా కొనేసుకోవచ్చు అంటూ ఆమె సంచలన కామెంట్ చేశారు.  సమంత రెండో వివాహం చేసుకున్న రోజున పూనమ్ చేసిన ఈ పోస్ట్ తెగ  వైరల్ అవుతోంది.

కొంత స్ట్రగుల్‌.. కొంత మానసిక ఒత్తిడి.. ఇంకొన్ని సూటిపోటి మాటలు అన్నీ దాటుకుని వ్యక్తిగత జీవితంలో మరో అడుగు ముందుకేశారు సమంత. డిసెంబర్ 1, సోమవారం బాలీవుడ్‌ డైరెక్టర్‌ కమ్‌ ప్రొడ్యూసర్‌ రాజ్‌ను పెళ్లాడారు.. సామ్‌కీ, రాజ్‌కీ మధ్య దాదాపు 12 ఏళ్ల ఏజ్‌ గ్యాప్‌ ఉంది. రాజ్‌ 1975లో పుట్టగా, సామ్‌ 1987లో పుట్టారు.

Follow Us