Pooja Hegde: ఛాన్స్ వస్తే అలాంటి సినిమాలో నటించాలని ఉంది.. మనసులో మాట బయటపెట్టిన బుట్టబొమ్మ

|

Apr 20, 2023 | 7:49 PM

ఈ భామ కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్ ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఇంట్రస్టింగ్ విషయాలను రివీల్ చేస్తున్నారు ఈ బ్యూటీ.  రాధేశ్యామ్ రిలీజ్‌కు ముందు కెరీర్‌లో మంచి ఫామ్‌లో ఉన్నారు పూజా హెగ్డే.

Pooja Hegde: ఛాన్స్ వస్తే అలాంటి సినిమాలో నటించాలని ఉంది.. మనసులో మాట బయటపెట్టిన బుట్టబొమ్మ
Pooja Hegde
Follow us on

స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రజెంట్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. చాలా రోజులుగా బాలీవుడ్‌లో జెండా పాతేందుకు ఎదురుచూస్తున్న ఈ భామ కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్ ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఇంట్రస్టింగ్ విషయాలను రివీల్ చేస్తున్నారు ఈ బ్యూటీ.  రాధేశ్యామ్ రిలీజ్‌కు ముందు కెరీర్‌లో మంచి ఫామ్‌లో ఉన్నారు పూజా హెగ్డే. కానీ ఆ సినిమా ఫెయిల్యూర్ అరవింద ఆశలు ఆవిరి చేసేసింది. రాధేశ్యామ్‌ సూపర్ హిట్ అయితే పాన్ ఇండియా హీరోయిన్‌గా బిజీ అవ్వొచ్చని భావించిన బుట్టబొమ్మకు షాక్ తగిలింది. అయితే ఇప్పుడు కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్ సినిమాతో మరోసారి ఆ ఛాన్స్ వచ్చింది.

సల్మాన్ హీరోగా తెరకెక్కిన కిసీ కా భాయ్‌ కిసీ కి జాన్ బాలీవుడ్ మూవీనే అయినా.. ఈ సినిమాలో పూజా తెలుగమ్మాయి పాత్రలో నటించటం, కీలక పాత్రలో వెంకటేష్ కూడా నటిస్తుండటంతో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకే ఈ సినిమా విషయంలో పూజా కూడా చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నారు.

ప్రజెంట్ ఈ మూవీ ప్రమోషన్‌లోనే బిజీగా ఉన్న పూజా హెగ్డే, తన ఫ్యూచర్ ప్లాన్స్‌ రివీల్ చేశారు. ప్రజెంట్ కమర్షియల్ హీరోయిన్‌గా తన కెరీర్‌ హ్యాపీగానే ఉన్నా.. ఛాన్స్ వస్తే లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనూ ప్రూవ్ చేసుకోవాలనుందన్నారు పూజా హెగ్డే. మరి పూజా డైరెక్ట్‌గా రిక్వెస్ట్ చేసిన తరువాతైనా మేకర్స్ అలాంటి సినిమాలు ప్లాన్ చేస్తారేమో చూడాలి.