A. R. Rahman: రెహమాన్ ఆత్మీయంగా హత్తుకున్న ఈ చిన్నాడు ఎవరో తెలుసా..? లేటెస్ట్ సెన్సేషన్ అతడు
రెహమాన్ సంగీతాన్ని, ఆయన పాటలను ఎంజాయ్ చేయని వారు ఉండరు. ఇక పై ఫొటోలో రెహమాన్ హత్తుకున్న చిన్నోడు ఎవరో తెలుసా..? రెహమాన్ ఆత్మీయంగా హత్తుకున్న ఆ చిన్నోడు ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఓ సెన్సేషన్..అతను ఎవరో గుర్తుపట్టారా..

సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ఏ ఆర్ రెహమాన్. తన మ్యూజిక్ తో సినిమాకు ప్రాణం పొసే రెహమాన్ ఎన్నో అద్బుతమైన పాటలను అందించారు. చిన్న వయసులోనే సంగీత దర్శకుడిగా మారి సూపర్ హిట్ సాంగ్స్ ను అందించారు ఈ లెజెండ్. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఎన్నో సూపర్ హిట్స్ సినిమాలకు పని చేశారు రెహమాన్. రెహమాన్ సంగీతానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. రెహమాన్ సంగీతాన్ని, ఆయన పాటలను ఎంజాయ్ చేయని వారు ఉండరు. ఇక పై ఫొటోలో రెహమాన్ హత్తుకున్న చిన్నోడు ఎవరో తెలుసా..? రెహమాన్ ఆత్మీయంగా హత్తుకున్న ఆ చిన్నోడు ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఓ సెన్సేషన్..అతను ఎవరో గుర్తుపట్టారా..
పై ఫొటోలో రెహమాన్ తో ఉన్న చిన్నారి ఎవరో కాదు.. మ్యూజిక్ సెన్సేషన్ జివి ప్రకాష్. మ్యూజిక్ డైరెక్టర్ గా జివి ప్రకాష్ రాణిస్తున్నారు. కేవలం మ్యూజిక్ డైరెక్టర్ గానే కాదు హీరోగానూ సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు ఈ యంగ్ టాలెంట్. ఎ. ఆర్. రెహ్మాన్ కు మేనల్లుడు జివి ప్రకాష్.
ఎ. ఆర్. రెహ్మాన్ దగ్గర ముందుగా పలు సినిమాలకు పని చేశాడు ప్రకాష్. ప్రకాష్ మొదటి సారిగా తన మేనమామ ఎ. ఆర్. రెహమాన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన శంకర్ సినిమా జెంటిల్మేన్ కి సౌండ్ ట్రాక్ విభాగంలో పనిచేశాడు అలాగే కొద్ది రోజులు హ్యారిస్ జయరాజ్ దగ్గర కూడా శిష్యరికం చేశాడు. జివి ప్రకాష్ భార్య సైంధవి గాయని.. ఎస్. శంకర్ నిర్మాణ సారథ్యంలో, వసంత బాలన్ దర్శకత్వంలో వచ్చిన వేయిల్ అనే తమిళ సినిమాతో సంగీత దర్శకుడిగా మారాడు. తాజాగా రెహమాన్ , జివి ప్రకాష్ ఫోటో వైరల్ గా మారింది.
View this post on Instagram




