Pooja Hegde: పూరీ,విజయ్ జనగణమన కోసం పూజాకు దిమ్మతిరిగే రెమ్యునరేషన్..!

ఒకలైలా కోసం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది బుట్టబొమ్మ పూజాహెగ్డే. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ఈ పొడుగుకాళ్ల సుందరి.

Pooja Hegde: పూరీ,విజయ్ జనగణమన కోసం పూజాకు దిమ్మతిరిగే రెమ్యునరేషన్..!
Poojahegde

Updated on: Jun 07, 2022 | 3:35 PM

ఒకలైలా కోసం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది బుట్టబొమ్మ పూజాహెగ్డే(Pooja Hedge). తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ఈ పొడుగుకాళ్ల సుందరి. పూజాహెగ్డే దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి ఆకట్టుకుంది. తెలుగుతో పాటు, తమిళ్ హిందీ సినిమాల్లోనూ హీరోయిన్ గా చేసింది పూజా.. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో అరడజను వరుకు సినిమాలున్నాయి. వాటిలో విజయ్ దేవరకొండ జనగణమన సినిమా ఒకటి. డైనమిక్ డైరెక్టర్ పూరీజగన్నాథ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే పూరీజగన్నాథ్ విజయ్ దేవరకొండ కలిసి లైగర్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాతో పాటుగా జనగణమన అనే సినిమాను కూడా చేస్తున్నారు ఈ ఇద్దరూ.. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజాహెగ్డే నటిస్తుందని ఇటీవలే అనౌన్స్ చేశారు. దేశ భక్తి ప్రధానంగా రూపొందనున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఈ భారీ చిత్రాన్ని చార్మితో కలిసి స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి నిర్మిస్తున్నారు.

ఇప్పుడు పూజాహెగ్డే జనగణమన సినిమాకు డిమాండ్ చేసిన రెమ్యునరేష్ హాట్ టాపిక్ గా మారింది. జనగణమన సినిమాకు పూజాహెగ్డే భారీ రెమ్యునరేష్ అందుకోనుందని ఫిలిం సర్కిల్స్ లో జారుగా ప్రచారం జరుగుతుంది. విజయ్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ సినిమా కోసం పూజాహెగ్డే ఏకంగా 4 కోట్లు రెమ్యునరేషన్ అందుకోనుందని టాక్ వినిపిస్తుంది. జనగణమన సినిమాతో మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రానున్న సినిమాలోనూ పూజా హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. అలాగే హిందీలో సల్మాన్ ఖాన్ సరసన కబీ ఈద్ కబీ దివాళీ, రణ్ వీర్ సింగ్ హీరోగా నటిస్తున్న సర్కస్ సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది పూజా.