AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: హీరో ప్రభాస్ పీఆర్వోపై పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజి బిజీగా ఉంటున్నాడు. ఇప్పటికే మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ది రాజా సాబ్ మూవీ షూటింగ్ పూర్తికావొచ్చింది. దీని తర్వాత హను రాఘవ పూడి ఫౌజీ షూటింగ్ కూడా పెట్టాలెక్కనుంది.

Prabhas: హీరో ప్రభాస్ పీఆర్వోపై పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?
Prabhas
Follow us
Basha Shek

|

Updated on: Mar 30, 2025 | 1:05 PM

హీరో ప్రభాస్‌ పీఆర్వోగా చెప్పుకుంటున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తనను చంపుతామని బెదిరించారంటూ ఓ యూట్యూబర్ చేసిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 44లో ఓ యూట్యూబ్ ఛానెల్ ఉంది. అందులో ఒక జర్నలిస్ట్‌ అసోసియేట్‌ ఎడిటర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల తన న్యూస్ ఛానెల్ లో ప్రభాస్ ఆరోగ్యం గురించి ఒక వీడియో పోస్ట్ చేశాడీ జర్నలిస్ట్. డార్లింగ్‌ ఇన్‌ డేంజర్‌ అనే హెడ్డింగ్‌తో ఈ నెలలోనే ప్రభాస్ కు మేజర్ సర్జరీ అంటూ ఈ వీడియోను పోస్ట్ చేయగా అది కాస్తా సామాజిక మాధ్యమల్లో వైరల్ గా మారింది. మరుసటి రోజు సురేష్‌ కొండి అనే వ్యక్తి జర్నలిస్ట్ కు ఫోన్‌ చేసి తాను ప్రభాస్‌ పీఆర్వోనని పరిచయం చేసుకున్నాడు. ప్రభాస్‌కు మేజర్‌ సర్జరీ జరిగిందంటూ, అనారోగ్యం బారిన పడ్డాడంటూ ‌ యూట్యూబ్‌లో పెట్టిన పోస్ట్‌కు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అని సురేష్‌ ప్రశ్నించాడు. వెంటనే ఆ వీడియోను డిలీట్‌ చేయాలని బెదిరిస్తూ అసభ్య పదజాలంతో దూషించాడు. అయితే ఈ వీడియోను సదరు జర్నలిస్ట్ డిలీట్‌ చేయలేదు. దీంతో కొండి సురేష్‌ ఈ పోస్ట్‌ను ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు పంపించాడు.

ఈ పోస్ట్‌ చూసిన ప్రభాస్‌ అభిమానులు ఫోన్‌కాల్, ఎస్‌ఎంఎస్, వాట్సప్‌ మెసేజ్‌లలో జర్నలిస్ట్ ను తీవ్రంగా దూషించారు. ‘నిన్ను చంపేస్తాం.. మీ ఆఫీసును తగలబెడతం’ అంటూ హెచ్చరించారు. ఇదే క్రమంలో ఈ నెల 6వ తేదీన కొంత మంది యువకులు యూట్యూబ్ ఛానెల్ కార్యాలయానికి వచ్చారు. తాము ప్రభాస్ అభిమానులమంటూ గొడవకు దిగారు. దీంతో జర్నలిస్ట్ డయల్ 100 కు ఫిర్యాదు చేశాడు. జూబ్లీహిల్స్‌ పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం ఈ న్యూసెన్స్‌కు కారణమైన సురేష్‌ కొండిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి

కన్నప్ప సినిమాలో రుద్రుడిగా ప్రభాస్..

.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పేల్చేస్తే పోలా! ఆర్మీనా మజాకా.. టెర్రరిస్టులు, వారి సహాయకులపై..
పేల్చేస్తే పోలా! ఆర్మీనా మజాకా.. టెర్రరిస్టులు, వారి సహాయకులపై..
సంతానం కలిగేలా చేస్తామన్నారు.. కట్‌చేస్తే.. చావు దెబ్బలు తిన్నారు
సంతానం కలిగేలా చేస్తామన్నారు.. కట్‌చేస్తే.. చావు దెబ్బలు తిన్నారు
శుభం ట్రైలర్‏లో సర్ ప్రైజ్ చేసిన సామ్..
శుభం ట్రైలర్‏లో సర్ ప్రైజ్ చేసిన సామ్..
నా తర్వాతి సినిమా ఆ టాలీవుడ్ డైరెక్టర్‌తోనే: కోలీవుడ్ హీరో సూర్య
నా తర్వాతి సినిమా ఆ టాలీవుడ్ డైరెక్టర్‌తోనే: కోలీవుడ్ హీరో సూర్య
7 మ్యాచ్‌ల్లో 48 పరుగులు.. ఐపీఎల్ 2025లో కాస్ట్లీ మిస్టేక్ ఇతనే
7 మ్యాచ్‌ల్లో 48 పరుగులు.. ఐపీఎల్ 2025లో కాస్ట్లీ మిస్టేక్ ఇతనే
తెలుగులోనూ లస్ట్ స్టోరీస్ లాంటీ సినిమా.. ఫ్యామిలీతో చూడలేరు బాబోయ
తెలుగులోనూ లస్ట్ స్టోరీస్ లాంటీ సినిమా.. ఫ్యామిలీతో చూడలేరు బాబోయ
చూపులతోనే కవ్విస్తున్న వయ్యారి భామ అంజలి...
చూపులతోనే కవ్విస్తున్న వయ్యారి భామ అంజలి...
తక్షణమే రాష్ట్రం వదిలి వెళ్లండి..ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు!
తక్షణమే రాష్ట్రం వదిలి వెళ్లండి..ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు!
ఉగ్రదాడిపై మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ ఏమన్నారంటే..?
ఉగ్రదాడిపై మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ ఏమన్నారంటే..?
ఎవరు ముందు చేస్తే ఏంటి? కోలీవుడ్ హీరోలపై ఫ్యాన్స్ ఫైర్..
ఎవరు ముందు చేస్తే ఏంటి? కోలీవుడ్ హీరోలపై ఫ్యాన్స్ ఫైర్..