Sree Leela: పెళ్లిసందడి బ్యూటీకి క్యూ కడుతున్న క్రేజీ ఆఫర్స్.. మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన కుర్రది..

పెళ్ళి సందడి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రి ఇచ్చింది ముద్దుగుమ్మ శ్రీలీల. రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్ళిసందడి సినిమాలో హీరోగా శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించాడు.

Sree Leela: పెళ్లిసందడి బ్యూటీకి క్యూ కడుతున్న క్రేజీ ఆఫర్స్.. మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన కుర్రది..
Shree Leela

Updated on: Mar 18, 2022 | 3:59 PM

Sree Leela: పెళ్ళి సందడి(Pelli sandaDI )సినిమాతో హీరోయిన్ గా ఎంట్రి ఇచ్చింది ముద్దుగుమ్మ శ్రీలీల. రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్ళిసందడి సినిమాలో   శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించాడు. ఇక ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ అమ్మడికి తెలుగులో మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ అమ్మడు మాస్ మహారాజ రవితేజ సరసన నటించే అవకాశం అందుకుంది. రవితేజ హీరోగా వస్తున్న ధమాకా సినిమాలో ఈఅమ్మడు నటిస్తుంది. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్  శరవేగంగగా జరుగుతోంది. ఈ సినిమా తర్వాత మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో సినిమా చేస్తుంది ఈ వయ్యారి భామ. అలాగే నవీన్ పోలిశెట్టి తో ఓ సినిమా చేసేందుకు సైన్ చేసిందట.

అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రానున్న సినిమాలోనూ ఈ అమ్మడు ఛాన్స్ దక్కించుకుందని టాక్. ఈ మూవీలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీలీల సెకండ్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిన్నదానికి మరో క్రేజీ ఆఫర్ వచ్చిందని తెలుస్తుంది. రైటర్ కమ్ డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్న ఓ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా ఎంపిక అయ్యిందని టాక్ వినిపిస్తుంది. అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తర్వాత వక్కంతం వంశీ చేస్తున్న సినిమా ఇది. ఇక ఈ మూవీలో తన పాత్రకు మంచి స్కోప్ ఉండటంతో శ్రీలీల వెంటనే ఓకే చెప్పిందని టాక్ నడుస్తోంది.

 

మరిన్ని ఇక్కడ చదవండి : 

Kashmir Files: కశ్మీర్‌ ఫైల్స్‌ చిత్ర దర్శకుడికి భద్రత పెంపు.. వై క్యాటగిరీ కల్పిస్తూ అధికారుల నిర్ణయం..

Prabhas: మారుతి సినిమాకు ప్రభాస్‌ అన్ని కోట్లు తీసుకుంటున్నారా.? రోజుకు ఏకంగా కోటి రూపాయల పైమాటే..

Bheemla Nayak Aha: ఆహాలో పవర్ స్ట్రోమ్.. స్ట్రీమింగ్‏కు సిద్ధమైన బ్లాక్ బస్టర్ భీమ్లా నాయక్..