Pawan Kayan Krish Movie Fighting Scence: పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. మొఘలాయుల కాలంనాటి నేపథ్యంలో సాగే కథతో రానున్నట్లు వార్తలు రావడం, ఇందులో పవన్ బందీపోటుగా కనిపించనున్నాడని ప్రచారం జరగడంతో సినిమాపై క్యురియాసిటీ పెరిగిపోయింది.
ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న వార్త అయినా సంచలనంగా మారుతోంది. తాజాగా ఇలాంటి ఓ వార్తే ఫిలిమ్ నగర్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమాలో పవన్ కోసం క్రిష్ ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ని ప్లాన్ చేశాడు. ఇందు కోసం భారీ చార్మినార్ సెట్‌ను కూడా వేశారు. కాగా.. ఈ ఫైట్‌లో పవర్ స్టార్ మల్లయోధులతో కుస్తీ చేయనున్నాడని తెలుస్తోంది. తాజాగా ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. పవన్ కళ్యాణ్ భారీ దేహాలతో ఉన్న మోల్లయోధులతో కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే విధంగా క్రిష్ సినిమాను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నాడు. దీని తర్వాత హరిష్ శంకర్‌తో, అయ్యప్పన్ కొషియమ్ రీమేక్‌లోనూ నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇలా ఒకే సారి మూడుకు పైగా చిత్రాల్లో పవన్ నటిస్తుండడంతో ఆయన అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు.
Also Read: Pushpa Movie: అల్లు అర్జున్ ‘పుష్ఫ’ చిత్రాన్ని ఒప్పుకోవడానికి రూ. లక్షన్నర కోట్లే కారణమా..?