Tholiprema: పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. తొలిప్రేమ రీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. ఎప్పుడంటే?

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ కెరీర్‌ ప్రారంభంలో నటించిన ప్రేమకథా చిత్రం తొలిప్రేమ. కరుణాకరన్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ ఎవర్‌ గ్రీన్‌ లవ్‌ స్టోరీలో కీర్తి రెడ్డి హీరోయిన్‌గా నటించింది. 1998లో రిలీజైన ఈ సినిమా యూత్‌ను తెగ ఆకట్టుకుంది. లవ్‌ స్టోరీతో పాటు అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్‌ హైలెట్‌గా నిలిచాయి

Tholiprema: పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. తొలిప్రేమ రీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. ఎప్పుడంటే?
Pawan Kalyan's Tholi Prema Movie

Updated on: Jun 23, 2023 | 9:02 PM

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ కెరీర్‌ ప్రారంభంలో నటించిన ప్రేమకథా చిత్రం తొలిప్రేమ. కరుణాకరన్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ ఎవర్‌ గ్రీన్‌ లవ్‌ స్టోరీలో కీర్తి రెడ్డి హీరోయిన్‌గా నటించింది. 1998లో రిలీజైన ఈ సినిమా యూత్‌ను తెగ ఆకట్టుకుంది. లవ్‌ స్టోరీతో పాటు అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్‌ హైలెట్‌గా నిలిచాయి. ఇక పాటల సంగతి వేరే చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ టీవీల్లో ఈ మూవీ వస్తే చాలామంది అసలు వదిలిపెట్టరు. అలాంటి తొలిప్రేమ సినిమా మళ్లీ థియేటర్లలో రీ రిలీజ్‌ కానుంది. తొలిప్రేమ సినిమా రిలీజై ఇర‌వై ఐదేళ్లు గడిచిన సందర్భంగా థియేటర్లలో ఈ బ్లాక్‌ బస్టర్‌ సినిమాను రీ రిలీజ్ చేయనున్నారు. జూన్‌ 30 4K టెక్నాలజీతో ఈ ఎవర్‌ గ్రీన్‌ క్లాసిక్‌ లవ్‌ స్టోరీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లోనూ పవన్‌ సినిమాను భారీగా విడుదల చేసేందుకు అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 300 థియేటర్లలో సినిమా రిలీజయ్యేలా ప్రణాళికలు రచిస్తున్నారు. కాగా ఇప్పటికే పవన్‌ కల్యాణ్‌ నటించిన జల్సా, ఖుషి సినిమాలు రీ రిలీజయ్యాయి. రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించాయి.

ఇప్పుడు తొలిప్రేమ కూడా అదే స్థాయి కలెక్షన్లను రాబట్టి రికార్డులు కొల్లగొడుతుందని పవన్‌ అభిమానులు భావిస్తున్నారు. కాగా ప్రస్తుతం తన సినిమాలకు కాస్త బ్రేక్‌ ఇచ్చాడు పవర్‌ స్టార్‌. వారాహి యాత్రలో బిజీబిజీగా ఉంటున్నారు. అయితే జులైలో మాత్రం బ్రో సినిమాతో ఆడియెన్స్‌ ముందుకు రానున్నాడు పవర్‌ స్టార్‌. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌ కూడా ఇందులో నటిస్తున్నాడు. దాదాపు షూటింగ్‌ పూర్తి కావొచ్చిన ఈ సినిమా జులై 28న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. దీంతో పాటు ఓజీ, ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌, హరిహర వీరమల్లు క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నాడు పవన్‌ కల్యాణ్‌.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి