పవన్ కల్యాణ్ ‘ఖుషీ’కి ఇరవై ఏళ్లు..! ట్విట్టర్‌లో ట్రెండింగ్ చేస్తున్న జనసేన ఫ్యాన్స్‌..

20 Years for Kushi : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన సినిమాలలో చాలా వరకు ట్రెండ్ సెట్ చేసినవే. తెలుగు సినీ చరిత్రలో ఆయన సినిమాలకు ఒక

పవన్ కల్యాణ్ ఖుషీకి ఇరవై ఏళ్లు..! ట్విట్టర్‌లో ట్రెండింగ్ చేస్తున్న జనసేన ఫ్యాన్స్‌..
20 Years For Kushi

Updated on: Apr 27, 2021 | 8:46 PM

20 Years for Kushi : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన సినిమాలలో చాలా వరకు ట్రెండ్ సెట్ చేసినవే. తెలుగు సినీ చరిత్రలో ఆయన సినిమాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. హిట్లు, ప్లాప్‌ అనే తేడా లేకుండా ఆయన సినిమాలను ఆదరిస్తారు అభిమానులు. చేసినవి తక్కువ సినిమాలే అయినా ప్రజలలో ఆయనకు ఉండే క్రేజ్ మరే హీరోకు ఉండదు. అలాంటి ఆయన సినిమాలలో ఖుషీ సినిమా ఒకటి. ఈ సినిమా ద్వారా పవన్ కల్యాణ్‌కు యూత్‌లో యమ క్రేజీ ఏర్పడింది. అతడి సినీ చరిత్రలో ఒక ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా రిలీజై నేటికీ 20 ఏళ్లు గడుస్తోంది. దీంతో జనసేన ఫ్యాన్స్ ట్విట్టర్లో సందడి చేస్తున్నారు. మరి ఆ చిత్ర విశేషాలేంటో తెలుసుకుందాం..

భూమిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు ఎస్‌జే సూర్య దర్శకత్వం వహించారు. పవన్ తో పోటాపోటీగా నటించింది భూమిక. శ్రీ సూర్య మూవీస్ పై ఏ.ఎం.రత్నం ఈ సినిమాను నిర్మించారు. తమిళంలో విజయ్ నటించిన ఖుషీకి తెలుగు రీమేక్ గా తీశారు. ఈ సందర్భంగా సినిమాలోని సన్నివేశాలను, రికార్డులను #20YearsForClassicIHKushi, #Kushi, #Pawanakalyan ట్విట్టర్ లో ట్రెండింగ్ చేస్తున్నారు నెటిజన్లు.

ఈ సినిమాలోని పాటలు, పవన్ మ్యానరిజం, డైలాగ్‌లు అన్నీ హైలెట్ గానే అనిపిస్తాయి. సిద్దు పాత్రలో పవన్ కల్యాణ్ చక్కగా ఒదిగిపోయాడు. అలాగే హీరోయిన్ భూమిక కూడా పవన్ కల్యాణ్ కు ఏ మాత్రం తీసిపోకుండా చేసింది. మధు పాత్రలో తన అభినయాన్ని కనబరిచింది. ముఖ్యంగా సినిమాలో వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఎవర్ గ్రీన్ అని చెప్పవచ్చు. ఇప్పటికి ప్రతి ఒక్కరి జీవితంలో ఖుషీ సన్నివేశాలను గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటారంటే అతిశయోక్తి కాదు. అంతేకాకుండా ఈ సినిమాలోని సాంగ్స్ ప్రతి ఒక్కటి ఇప్పటికి అందరి నోట్లోలో నానుతుంటాయి.

కేకేతో మణి శర్మ మొదటి సారి పాడించిన హిందీ సాంగ్ `యే మేరా జహాన్ ` తెలుగు చిత్ర రంగంలో నే తొలి ప్రయోగం. ఈ పాట కూడా అదే రేంజ్ లో హిట్ అయ్యింది. సెకాండాఫ్ లో వచ్చే కార్నివాల్ ఫైట్ సీన్స్‌కు పవన్ కళ్యాణ్ స్వయంగా దర్శకత్వం వహించారు. మిస్సమ్మ లోని ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే పాటను ఈ చిత్రంలో రీ-మిక్స్ చేశారు. బై బై యే బంగారు రమణమ్మ, రంగబోతి ఓ రంగబోతి వంటి జానపద గీతాలను ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ స్వయంగా పాడారు.

Hen and Dog: కుక్కతో కోడి దొంగాట! దోబూచులాటల్లో ఇదే బెస్ట్ అంటున్న ఇంటర్నెట్ జనాలు.. Viral Video

Delhi Corona: ఢిల్లీలో యమా డేంజర్‌.. గంటకు 12 మంది కరోనాతో మృతి.. కాలిపోయేందుకు 20 గంటల పాటు క్యూలైన్‌లో ఉంటున్న శవాలు