
ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోవైపు తాను ఒప్పుకొన్న సినిమాలు కంప్లీట్ చేసేశారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. గతేడాది హరి హర వీరమల్లు, ఓజీలతో అభిమానలను పలకరించిన పవర్ స్టార్ లేటెస్ట్ గా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో మన ముందుకు వచ్చారు. ఉగాది కానుకగా రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబడుతోంది. ఇదిలా ఉంటే ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పవన్ కల్యాణ్ మరిన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ప్రస్థానం డైరెక్టర్ దేవా కట్టా దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు పవన్ అంగీకరించారని నెట్టింట రూమర్లు వినిపిస్తున్నాయి. ఇలా పవన్ కల్యాణ్ తదుపరి సినిమాల గురించి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన టీం స్పందించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెటట్టింది. అందులో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎలాంటి కొత్త ప్రాజెక్టులకు సంతకం చేయలేదని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతమున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పవన్ కల్యాణ్ కొత్త సినిమాలకు కమిట్ అవ్వడం లేదని, సోషల్ మీడియాలో వస్తోన్న ఊహాగానాలను నమ్మవద్దని సూచించారు. ఇక పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఓజి 2 అప్డేట్ గురించి తెలియజేస్తూ సరైన సమయంలో పవన్ కల్యాణే స్వయంగా ఈ సినిమా గురించి సమాచారం ఇస్తారని తెలిపారు.
కాగా ఎన్నికల ముందే హరి హర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను ఒప్పుకొన్నారు పవన్ కల్యాణ్. అయితే ఎన్నికల హడావుడిలో ఆ సినిమాల షూటింగులకు వరుసగా బ్రేకులు పడ్డాయి. అయితే నిర్మాలు నష్టపోకూడదనే ఉద్దేశంలో డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూనే మూడు సినిమాలను కంప్లీట్ చేశారు పవన్. ఇందులో ఓజీ బ్లాక్ బస్టర్ కావడంతో దీని సీక్వెల్ లోనూ నటిస్తానని అభిమానులతో చెప్పుకొచ్చారు. ఇక ఆ మధ్యన సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో నూ పవన్ ఓ సినిమా చేయనున్నారని ప్రచారం జరిగింది. అలాగే లేటెస్ట్ గా దేవా కట్టా డైరెక్షన్ లోనూ ఓ మూవీ చేయనున్నారని రూమర్లు వినిపించాయి. ఇప్పుడు వీటిపైనే క్లారీటీ ఇస్తూ పవన్ టీమ్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.
As of now, Sri @PawanKalyan garu has not taken up any new film commitments. Speculations about ongoing projects are not accurate.
At present, there are no immediate plans to commence new films. Any developments will be communicated through official channels when ready.
With…
— Pawan Kalyan Creative Works (@PKCWoffl) March 23, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.