Vakeel Saab: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు దగ్గరై సినిమాలకు దూరమై దాదాపు మూడేళ్లు అవుతుంది. మూడేళ్ళ తర్వాత తిరిగి పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా వకీల్ సాబ్. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అంజలీ, అనన్య, నివేద థామస్ కీలక పాత్రలో నటించారు. శృతిహాసన్ చిన్న పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో పవన్ స్టైల్ కు ఆయన చెప్పిన డైలాగ్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. పవన్ కు ఈ సినిమా పర్ఫెక్ట్ కంబ్యాక్ అనే చెప్పాలి. ఇక ప్రకాష్ రాజ్ పోషించిన నంద పాత్ర సినిమాకు మరో హైలైట్ అనే చెప్పాలి. ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. మొదటి షో నుంచే ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. థమన్ అందించిన సంగీతం ఈ సినిమా విజయానిలో కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాలో మగువ మగువ సాంగ్ మంచి ఆదరణ దక్కించుకుంది. ఇక థియేట్రికల్ రన్ పూర్తవడంతో ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ కు సిద్ధం అవుతుంది వకీల్ సాబ్.
ఏప్రిల్ 30 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కి అవుతుందని చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. మరి థియేటర్స్ లో అలరించిన ‘వకీల్ సాబ్’ ఓటీటీలో ఏ మేరకు అలరిస్తాడో చూడాలి.
మరిన్ని ఇక్కడ చదవండి :