Pawan Kalyan: అమ్మబాబోయ్ అన్ని లక్షలా..! పవన్ కళ్యాణ్ వాచ్ ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

|

Jan 31, 2023 | 6:59 AM

క్రిష్ దర్శకత్వంలో హరిహరవీరమల్లు సినిమాలో నటిస్తున్నాడు పవన్.. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరిదశలో ఉంది. ఈ సినిమా ప్రిరియాడికల్ డ్రామాగా రూపొందుతోంది.

Pawan Kalyan: అమ్మబాబోయ్ అన్ని లక్షలా..! పవన్ కళ్యాణ్ వాచ్ ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
Pawan Kalyan.
Follow us on

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఆయన అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. కొంతకాలం సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చిన పవన్.. ఆ తర్వాత సినిమాలతో బిజీ అయ్యారు. వకీల్ సాబ్, భీమ్లానాయక్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన పవన్.. ఇప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. క్రిష్ దర్శకత్వంలో హరిహరవీరమల్లు సినిమాలో నటిస్తున్నాడు పవన్.. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరిదశలో ఉంది. ఈ సినిమా ప్రిరియాడికల్ డ్రామాగా రూపొందుతోంది. ఈ సినిమాలో పవన్ బందిపోటుగా కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాతో పాటు రీసెంట్ గా సుజిత్ దర్శకత్వంలో ఓజి అనే సినిమాను ఓకే చేశారు పవర్ స్టార్. సాహో సినిమాతో ప్రేక్షకులను అలరించిన సుజిత్.. ఇప్పుడు పవన్ తో సినిమా చేస్తుండటంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

నిన్న హైదరాబాద్ తో పవన్ సుజిత్, పవన్ సినిమా ప్రారంభొత్సహవం గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి థమన్‌ హాజరుకావడంతో ఈ చిత్రానికి సంగీత దర్శకుడు థమన్‌ అని తెలుస్తోంది. ఇక చిత్ర నిర్మాత డివివి దానయ్యతో పాటు అల్లు అరవింద్‌, దిల్‌రాజు, సురేశ్‌ బాబు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ బ్లాక్ కలర్ డ్రస్ లో సూపర్ స్టైలిష్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ పెట్టుకున్న వాచ్ .. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పవన్ వాచ్ ధర తెలిస్తే అందరు షాక్ అవ్వాల్సిందే. ‘పనేరాయ్’ అనే ప్రముఖ కంపెనీకి చెందిన ఈ వాచ్ ధర రూ. 13.52 లక్షలు అని  తెలుస్తోంది. పవర్ స్టార్ అభిమానులు ఈ స్టైలిష్ వాచ్ గురించి నెట్లో సర్చ్ చేయగా దీని ధర తెలిసి షాక్ తింటున్నారు. ఇదిలా ఉంటే పవన్ సినిమాకు ‘ఓజీ’ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు.ఓజీ అంటే ఒరిజినల్ గ్యంగ్ స్టర్ అని అంటున్నారు. ఇప్పుడు ఈ వర్కింగ్ టైటిల్ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో పవన్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటించనున్నారన్న వార్తలకు బలం చేకూరుతోంది.

Pawan Kalyan