Kalki 2898 AD: ప్రభాస్ సినిమా కోసం పవన్ తనయుడు.. కల్కి టీ షర్ట్ వేసుకుని థియేటర్‌కు వచ్చిన అకీరా నందన్..వీడియో
రిలీజైన అన్ని చోట్లా ప్రభాస్ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తోంది. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్, యాక్షన్ సీక్వెన్స్, ప్రీ ఇంటర్వెల్, క్లైమాక్స్ అదిరిపోయాయని రివ్యూలు వస్తున్నాయి. దీంతో ప్రభాస్ అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కల్కి సినిమాను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనయుడు అకిరా నందన్ కల్కి సినిమాను వీక్షించాడు.
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడీ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తోన్న ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ గురువారం (జూన్ 27) ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజైంది. రిలీజైన అన్ని చోట్లా ప్రభాస్ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తోంది. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్, యాక్షన్ సీక్వెన్స్, ప్రీ ఇంటర్వెల్, క్లైమాక్స్ అదిరిపోయాయని రివ్యూలు వస్తున్నాయి. దీంతో ప్రభాస్ అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కల్కి సినిమాను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనయుడు అకిరా నందన్ కల్కి సినిమాను వీక్షించాడు. హైదరాబాద్ లోని ప్రసాద్ ఐ మ్యాక్స్ లో ఈ సినిమాను చూశాడు అకీరా. ఈ సందర్భంగా అకీరా కల్కి టీ షర్ట్ ధరించి థియేటర్‌కు రావడం విశేషం. పవన్ తనయుడిని చూసిన అభిమానులు అతనితో కలిసి ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. దీనిని చూసిన ప్రభాస్ అభిమానులు, ఇటు మెగా అభిమానులు తెగ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
మహానటి ఫేం నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, లోక నాయకుడు కమల్ హాసన్, దిశా పటానీ, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రామ్ గోపాల్ వర్మ, అన్నాబెన్, మాళవిక నాయర్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శోభన తదితరులు ఈ సినిమాలో నటించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు.
ప్రసాద్ ఐ మ్యాక్స్ థియేటర్లలోకి వస్తోన్న పవన్ కుమారుడు అకీరా నందన్.. వీడియో ఇదిగో..
Junior Power Star Akira Nandan Watching #Kalki2898AD With His Friends 🤩💥
Akira wearing Kalki T Shirt 😍 #Akira #PawanKalyan pic.twitter.com/VOFxkevndO
— PawanKalyan Addicts (@PK_Addicts) June 27, 2024
థియేటర్ లో కల్కి సినిమాను వీక్షిస్తోన్న అకీరా నందన్.. వీడియో
Akira Nandan to watch #Kalki2898AD at Prasads Imax 🔥pic.twitter.com/fnwIyikugL
— Pawan Kalyan Holics™ (@PSPKHolics) June 27, 2024
ప్రసాద్ మల్టీ ప్లెక్స్ ఆవరణలో ‘బుజ్జి’..
Look who just parked at #PrasadsMultiplex ❤️😍#Kalki2898AD #Bujji #Prabhas pic.twitter.com/OYyrNCVrPd
— Prasads Multiplex (@PrasadsCinemas) June 26, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.