Akki Roti: హెల్దీ బ్రేక్ ఫాస్ట్‌కి డిన్నర్‌కు మంచి రెసిపీ.. అక్కి రొట్టే!

ఉదయం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని అందరూ అనుకుంటారు. అలాంటి రెసిపీల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఏం వండాలా? ఎలా చేయాలా? అని గృహిణులు తలమునకలై పోతారు. అలాంటి హెల్దీ బ్రేక్ ఫాస్ట్ తినాలి అనుకునేవారికి ఈ అక్కి రొట్టే బెస్ట్ అని అంటున్నారు నిపుణులు. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. ఇది తినడం వల్ల రోజంతా యాక్టీవ్‌గా ఉంటారు. అంతే కాదు రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇది కర్నాటక స్పెషల్ వంటకం. అక్కి రోటీ.. గ్లూటెన్ ఫ్రీ అని చెప్పొచ్చు. ఇది బియ్యం పిండి..

Akki Roti: హెల్దీ బ్రేక్ ఫాస్ట్‌కి డిన్నర్‌కు మంచి రెసిపీ.. అక్కి రొట్టే!
Akki Roti
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Sep 26, 2024 | 9:15 PM

ఉదయం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని అందరూ అనుకుంటారు. అలాంటి రెసిపీల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఏం వండాలా? ఎలా చేయాలా? అని గృహిణులు తలమునకలై పోతారు. అలాంటి హెల్దీ బ్రేక్ ఫాస్ట్ తినాలి అనుకునేవారికి ఈ అక్కి రొట్టే బెస్ట్ అని అంటున్నారు నిపుణులు. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. ఇది తినడం వల్ల రోజంతా యాక్టీవ్‌గా ఉంటారు. అంతే కాదు రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇది కర్నాటక స్పెషల్ వంటకం. అక్కి రోటీ.. గ్లూటెన్ ఫ్రీ అని చెప్పొచ్చు. ఇది బియ్యం పిండి, కూరగాయలతో తయారు చేస్తారు. ఎంతో రుచిగా ఉండటంతో పాటు ఆరోగ్యం కూడా. పిల్లలు.. పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. కేవలం బ్రేక్ ఫాస్ట్‌గా మాత్రమే కాకుండా.. డిన్నర్‌గా కూడా తినొచ్చు. మరి ఈ అక్కి రోట్టెని ఎలా తయారు చేసుకుంటారు? దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

అక్కి రొట్టే తయారీకి కావాల్సిన పదార్థాలు:

బియ్యం పిండి, కొబ్బరి తురుము, జీలకర్ర, ఉప్పు, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, కరివేపాకు, కొత్తి మీర, అల్లం, ఆయిల్ లేదా నెయ్యి.

అక్కి రోటీ తయారీ విధానం:

ముందుగా ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, కొత్తి మీర, కరివేపాకు, అల్లాన్ని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు లోతైన పాత్ర తీసుకుని అందులో.. బియ్యం పిండి, ఉప్పు, జీలకర్ర పొడి, కొబ్బరి తురుము, కొద్దిగా ఆయిల్, సన్నగా తరిగిన ఉల్లిపాయలు మిగతా పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. మధ్య మధ్యలో నీళ్లు పోస్తూ.. చపాతీ పిండి మాదిరిగా కలపాలి. కావాలి అనుకునేవారు క్యారెట్ తురుము, క్యాప్సికమ్ తరుగు, క్యాబేజీ తరుము కూడా వేసుకోవచ్చు. ఇవి వేసినా కూడా రుచిగానే ఉటుంది.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు అరిటాకు తీసుకోవాలి. దానిపై కొద్దిగా ఆయిల్ లేదా నెయ్యి రాసుకోవాలి. కలుపుకున్న పిండి మిశ్రమాన్ని కొద్దిగా ఉండలా తీసుకుని.. అరిటాకుపై చపాతీ మాదిరిగా.. వేళ్లతో వత్తుకోవాలి. ఆ తర్వాత పెనం పెట్టి.. దానిపై ఆయిల్ వేసి మీరు అద్దిన చపాతీని పెనంపై వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. ఈ రొట్టెను కొబ్బరి చట్నీ లేదా ఏదైనా ఊరగాయతో తింటే చాలా రుచిగా ఉంటుంది. అంతే కాకుండా చాలా హెల్దీ కూడా. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓ సారి ట్రై చేసి చూడండి.