లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.
ఆ తరువాత సోగ్గాడే చిన్నినాయనా, భలే భలే మగాడివోయ్ వంటి హిట్ చిత్రాల్లో ఆమె నటించారు. మిస్టర్ మూవీలో వరుణ్-లావణ్య మొదటిసారి జతకట్టారు. ఆ మూవీ సెట్స్ లో పరిచయం ఏర్పడింది.
ఇది ఇలా అంటే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మెగా కోడలు. దాదాపు 9 ఏళ్లపాటు ప్రేమించుకున్నారు వరుణ్, లావణ్య.
అయితే గత సంవత్సరం ఇటలీలో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్ళైన తరువాత సినిమాల పరంగా కొద్దిగా దూరంగా ఉన్న సోషల్ మీడియా లో యాక్టీవ్ గానే ఉన్నది ఈ చిన్నది.
పెళ్లి తర్వాత కూడా లావణ్య త్రిపాఠి ఫోటో షూట్ ల విషయంలో ఏ మాత్రం తగ్గట్లేదు.. ఫోటో షూట్ లు చేస్తూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
ఇటీవల లావణ్య తల్లి అయ్యారంటూ ఓ న్యూస్ చక్కర్లు కొట్టింది. దీనిపై నాగబాబు ఫ్యామిలీ నుండి ఎలాంటి అధికారిక సమాచారం లేదు.