Left Over Chicken Curry: చికెన్ కర్రీ మిగిలిపోయిందా.. ఇలా చికెన్ సమోసాలు చేసేయండి..

సండే వచ్చిందంటే ఇంట్లో ఏదో ఒక నాన్ వెజ్ కర్రీ ఉంటుంది. అయితే ఎక్కువగా చాలా మంది చికెన్ తింటూ ఉంటారు. ఒక్కోసారి తినాలి అనిపించినప్పుడు కూడా చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ కర్రీ ఒక్కోసారి ఎక్కువగా మిగిలిపోతూ ఉంటుంది. కర్రీ మళ్లీ మళ్లీ తినాలి అనిపించదు కూడా. ఇలా మిగిలిపోయిన కర్రీతో చికెన్ సమోసాలను తాయరు చేసుకోవచ్చు. చికెన్ కర్రీతో.. చికెన్ సమోసాలను చేసుకోవడం చాలా సింపుల్. చాలా తక్కువ సమయంలోనే పూర్తి..

Left Over Chicken Curry: చికెన్ కర్రీ మిగిలిపోయిందా.. ఇలా చికెన్ సమోసాలు చేసేయండి..
Samosalu
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Sep 26, 2024 | 9:15 PM

సండే వచ్చిందంటే ఇంట్లో ఏదో ఒక నాన్ వెజ్ కర్రీ ఉంటుంది. అయితే ఎక్కువగా చాలా మంది చికెన్ తింటూ ఉంటారు. ఒక్కోసారి తినాలి అనిపించినప్పుడు కూడా చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ కర్రీ ఒక్కోసారి ఎక్కువగా మిగిలిపోతూ ఉంటుంది. కర్రీ మళ్లీ మళ్లీ తినాలి అనిపించదు కూడా. ఇలా మిగిలిపోయిన కర్రీతో చికెన్ సమోసాలను తాయరు చేసుకోవచ్చు. చికెన్ కర్రీతో.. చికెన్ సమోసాలను చేసుకోవడం చాలా సింపుల్. చాలా తక్కువ సమయంలోనే పూర్తి అయిపోయితాయి. మరి వీటిని ఎలా తయారు చేస్తారు? వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

చికెన్ కర్రీ సమోసాలు తయారీకి కావాల్సిన పదార్థాలు:

చికెన్ కర్రీ, ఆయిల్, ఉల్లిపాయ, క్యాప్సికం, కొత్తి మీర, కొద్దిగా చీజ్, మైందా పిండి, ఉప్పు.

చికెన్ కర్రీ సమోసాలు తయారీ విధానం:

ముందుగా చికెన్ కర్రీలో మిగిలిపోయిన ముక్కలను తీసి వాటిని ఒక బౌల్‌లో వేసుకోవాలి. వీటిల్లో బోన్స్ ఏమన్నా ఉంటే తీసేసి.. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయి తీసుకుని.. అందులో ఆయిల్ వేసి వేడి చేయాలి. ఈ ఆయిల్ వేడెక్కాక.. చికెన్ ముక్కలను వేసి వేయించుకోవాలి. చికెన్‌లోని తడి పోయాక.. ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం తరుగు, కొత్తి మీర తరుగు, ఉప్పు వేసి కలిపి.. ఒకసారి అంతా వేయించుకుని.. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చీజ్ తురిమి పక్కన పెట్టుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత మైదా పిండిలో కొద్దిగా ఉప్పు వేసుకుని.. చపాతీ పిండిలా మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకుని వాటిని సమోసా ఆకారంలో చుట్టుకోవాలి. ఇందులో చికెన్ స్టవ్ ఉంచి.. కొద్దిగా చీజ్ వేసి.. మైదా పిండి అంచులకు రాసి.. మూసేయాలి. ఇలా అన్నింటినీ తయారు చేసి.. పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని.. అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు సమోసాలన్నీ వేసి.. రెండు వైపులా ఎర్రగా వేయించి.. సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవడమే. వీటిని మయోనీస్ లేదా కెచప్‌తో తింటే ఎంతో రుచిగా ఉంటాయి.