Bendakaya Karam: బెండకాయ కారం ఇలా చేయండి.. మళ్లీ మళ్లీ ఇలాగే చేయమంటారు..

కూరగాయల్లో బెండకాయలు కూడా ఒకటి. వీటిల్లో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. ఆరోగ్యానికి బెండకాయలు చాలా మంచిది. వీటితో ఎన్నో రకాల వంటలు తయారు చేసుకోవచ్చు. కానీ ఇవి తినడం ఎవరికీ పెద్దగా నచ్చదు. బెండకాయలతో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. వీటితో తయారు చేసే వంటల్లో బెండకాయ కారం కూడా ఒకటి. ఇది సైడ్‌ డిష్‌ గా చాలా రుచిగా ఉంటుంది. సాంబార్, రసం, పెరుగు అన్నం, కూరలతో ఇలా ఎలా తిన్నా.. చాలా రుచిగా ఉంటుంది. ఈ రెసిపీ తయారు చేసుకోవడం..

Bendakaya Karam: బెండకాయ కారం ఇలా చేయండి.. మళ్లీ మళ్లీ ఇలాగే చేయమంటారు..
Bendakaya Karam
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Sep 26, 2024 | 9:30 PM

కూరగాయల్లో బెండకాయలు కూడా ఒకటి. వీటిల్లో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. ఆరోగ్యానికి బెండకాయలు చాలా మంచిది. వీటితో ఎన్నో రకాల వంటలు తయారు చేసుకోవచ్చు. కానీ ఇవి తినడం ఎవరికీ పెద్దగా నచ్చదు. బెండకాయలతో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. వీటితో తయారు చేసే వంటల్లో బెండకాయ కారం కూడా ఒకటి. ఇది సైడ్‌ డిష్‌ గా చాలా రుచిగా ఉంటుంది. సాంబార్, రసం, పెరుగు అన్నం, కూరలతో ఇలా ఎలా తిన్నా.. చాలా రుచిగా ఉంటుంది. ఈ రెసిపీ తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. మరి ఇంత రుచికరమైన బెండకాయ కారంను ఎలా తయారు చేసుకుంటారు? వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

బెండకాయ కారంకు కావాల్సిన పదార్థాలు:

బెండకాయలు, శనగ పిండి, ఉప్పు, ఆమ్ చూర్ పొడి, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఆయిల్, సోంపు పొడి, వాము, ఆయిల్.

ఇవి కూడా చదవండి

బెండకాయ కారం తయారీ విధానం:

ముందుగా ఒక కడాయి తీసుకుని అందులో శనగ పిండి వేసి వేయించాలి. ఇది రంగు మారేంత వరకూ వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఇందులో గరం మసాలా, ధనియాల పొడి, కారం, సోంపు పొడి వేసి బాగా మిక్స్ చేసి.. పక్కకు ఉంచుకోవాలి. నెక్ట్ ఇందులో ఆయిల్ వేసి వేడి వేయాలి. ఆయిల్ వేడెక్కాక.. వాము వేసి వేయించాలి. ఆ తర్వాత బెండకాయ ముక్కలు వేసి వేయిస్తూ ఉండాలి. ఇప్పుడు ఉప్పు, ఆమ్ చూర్ పొడి వేసి బాగా కలిపి.. మూత పెట్టి మధ్య మధ్యలో ముక్కల్ని కలుపుతూ ఉండాలి. బెండకాయ ముక్కలు వేగుతూ ఉండగానే.. వేయించి పక్కన పెట్టుకున్న శనగ పిండిని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఐదు నుంచి పది నిమిషాలు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బెండకాయ కారం పొడి సిద్ధం. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓసారి ట్రై చేయండి. ఇంది ఎంతో టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలకు కూడా ఇష్ట పడి మరీ తింటారు.