మత్తువదలరా 2 హిట్.. ఫరియా జోరు పెరిగేనా..?

26 September 2024

Rajeev 

జాతిరత్నాలు సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది టాల్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా. మొదటి చిత్రంతోనే అందం, అభినయం పరంగా ఫుల్ మార్కులు కొట్టేసింది.

జాతిరత్నాలు తర్వాత రావణాసుర సినిమాలో స్పెషల్ రోల్ లో సందడి చేసింది ఫరియా. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిరల్ సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించింది.

అలాగే స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. బంగర్రాజు సినిమాలో స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేసింది.

ఆతర్వాత తిరిగి హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేసింది. రవితేజ సరసన రావణాసుర సినిమా చేసింది.

రీసెంట్ గా అల్లరి నరేష్ కు జోడీగా ఆఒక్కటి అడక్కు అనే సినిమా చేసింది. కానీ ఈ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది

ఇక ఇప్పుడు మత్తువదలరా 2 సినిమాలో నటించింది. ఈ సినిమా తో ఎట్టకేలకు ఫరియా హిట్ అందుకుంది.

మత్తువదలరా2 సినిమాలో ఫరియా తన అందంతో ఆకట్టుకుంది. ఇక పై ఈ అమ్మడు వరుస హిట్స్ అందుకుంటుందేమో చూడాలి.