ఈ అమ్మడిని గుర్తుపట్టారా.. కెరీర్ స్టార్టింగ్‌లోనే బడా హీరో మూవీలో ఛాన్స్ కొట్టేసింది

26 September 2024

Rajeev 

ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టారా.? చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. 

ఆమె మరెవరో కాదు అందాల భామ రమ్య పసుపులేటి. సోషల్ మీడియాలో పాపులారిటీ తెచ్చుకున్న తెలుగమ్మాయి రమ్య పసుపులేటి హీరోయిన్ గా ఆఫర్స్ అందుకుంటుంది. 

హుషారు సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆతర్వాత చాలా ఆరోజులకు ఓ వెబ్ సిరీస్ లో మెరిసింది. 

ఇక రీసెంట్ గా మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమాలో రమ్య తన నటనతో పాటు అందాలతోనూ ఆకట్టుకుంది. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో ఉంది. 

ఇక ఈ బ్యూటీ ఇప్పుడు వరుస అవకాశాలను అందుకుంటుంది. తాజాగా ఓ బడా సినిమాలో ఆఫర్ అందుకుంది. 

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాలో చిరంజీవి చెల్లెలిగా కనిపించనుంది రమ్య పసుపులేటి.