Banana Appam: బనానాతో తియ్యని అప్పాలు.. పిల్లలకు బెస్ట్ స్నాక్..

చాలా మంది పిల్లలు ఎక్కువగా తియ్యని స్నాక్స్ ఇష్టంగా తింటారు. దీంతో ఎక్కువగా ఏం చేయాలా అని తల్లులు తల పట్టుకుంటారు. ఈసారి మీ పిల్లలకు తియ్యని అప్పాలు చేసి పెట్టండి. అది కూడా అరటి పండుతో చేయవచ్చు. ఇవి తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వీట ిని ఎక్కువగా తమిళనాడులోని కేరళలో తింటారు. అరటి పండుతో చేసే ఈ అప్పాలను చాలా సింపుల్‌గా, ఫాస్ట్‌గా చేయవచ్చు. ఇది వండటానికి కూడా ఎక్కువ సమయం తీసుకోదు. కేవలం పది నిమిషాల్లోనే..

Banana Appam: బనానాతో తియ్యని అప్పాలు.. పిల్లలకు బెస్ట్ స్నాక్..
Banana Appam
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Sep 26, 2024 | 9:00 PM

చాలా మంది పిల్లలు ఎక్కువగా తియ్యని స్నాక్స్ ఇష్టంగా తింటారు. దీంతో ఎక్కువగా ఏం చేయాలా అని తల్లులు తల పట్టుకుంటారు. ఈసారి మీ పిల్లలకు తియ్యని అప్పాలు చేసి పెట్టండి. అది కూడా అరటి పండుతో చేయవచ్చు. ఇవి తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వీట ిని ఎక్కువగా తమిళనాడులోని కేరళలో తింటారు. అరటి పండుతో చేసే ఈ అప్పాలను చాలా సింపుల్‌గా, ఫాస్ట్‌గా చేయవచ్చు. ఇది వండటానికి కూడా ఎక్కువ సమయం తీసుకోదు. కేవలం పది నిమిషాల్లోనే ఈ అరటి పండు అప్పాలను రెడీ చేయవచ్చు. ఇవి పిల్లలకు శక్తిని ఇవ్వడంతో పాటు.. పొట్ట నిండిన ఫీలింగ్ కూడా ఉంటాయి. అందులోనూ ఇంట్లోనే చేసినవి కాబట్టి.. పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. మరి ఈ అరటి పండు అప్పాలను ఎలా తయారు చేస్తారు? వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

అరటి పండు అప్పాలు తయారీకి కావాల్సిన పదార్థాలు:

అరటి పండ్లు, బియ్యం పిండి, బెల్లం తురుము, కొబ్బరి తురుము, యాలకుల పొడి, ఉప్పు, నీరు, ఆయిల్.

అరటి పండు అప్పాలు తయారీ విధానం:

ఈ అరటి పండు అప్పాలను తయారు చేయడానికి ముందుగా బాగా పండిన పండ్లను తీసుకోవాలి. బాగా పండిన పండ్లను తీసుకుంటేనే రెసిపీ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక గిన్నెలోకి అరటి పండ్లను చేతితో బాగా మెదిపి.. గుజ్జులా చేసుకోవాలి. దాన్ని ఒక గిన్నెలోకి వేయాలి. ఇప్పుడు ఇందులోనే బియ్యం పిండిని, యాలకుల పొడి, తురిమిన బెల్లాన్ని, కొబ్బరి తురుము, చిటికెడు ఉప్పు.. వేసి బాగా కలుపుకోవాలి. ఈ బేటర్ చాలా సాఫ్ట్‌గా అయ్యేంత వరకూ కలుపుతూనే ఉండాలి.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు గుంత పొంగనాల మూకిడి తీసుకోవాలి. స్టవ్ మీద పెట్టి.. కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేయాలి. ఇప్పుడు గరిటతో కొద్ది కొద్దిగా పిండి తీసుకుని గుంతల్లో వేయాలి. మధ్య మధ్యలో చెక్ చేస్తూ.. ఒక వైపు ఉడికాక.. మరోవైపు తిప్పాలి. రెండు వైపులా ఎర్రగా వేగాక.. సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకోవాలి. వీటిని నేరుగా చేతితో కూడా తినవచ్చు. పిల్లలకు ఈ స్నాక్ బాగా నచ్చుతుంది. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓ సారి ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటాయి.