Pawan Kalyan: ‘రామ్ చరణ్ నుంచి డబ్బులు తీసుకునేవాన్ని’.. స్వయంగా చెప్పేసిన పవర్ స్టార్..

|

Sep 15, 2022 | 1:34 PM

చరణ్ వద్ద డబ్బులు తీసుకునేదని.. వడ్డీతో సహా అప్పు తీర్చేస్తానంటూ ఎక్కువగా డబ్బులు తీసుకునేదంటూ పవర్ స్టార్ చెప్పారు.

Pawan Kalyan: రామ్ చరణ్ నుంచి డబ్బులు తీసుకునేవాన్ని.. స్వయంగా చెప్పేసిన పవర్ స్టార్..
Pawan Charan
Follow us on

తెలుగు చిత్రపరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‏కు (Pawan Kalyan) ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఫ్యాన్స్ ఉన్న హీరోలలో పవర్ స్టార్ ముందుంటారు. పవన్ సినిమా వస్తే థియేటర్లలో అభిమానులు చేసే రచ్చ గురించి తెలిసిందే. మెగా ఫ్యామిలీలో చిరు తర్వాత అంతటి క్రేజ్ సంపాదించుకున్నారు పవర్ స్టార్. ఇక వీరిద్దరి తర్వాత చిరు తనయుడు రామ్ చరణ్ సైతం ఇండస్ట్రీలో అద్భుతమైన నటనతో సత్తా చాటుతున్నారు. మెగాపవర్ స్టార్‏గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చరణ్.. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. అయితే మెగా ఫ్యామిలీలోని హీరోల మధ్య ఉండే బాండింగ్ గురించి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ మధ్య మంచి బాండింగ్ ఉంటుంది. ఇక యువతరం రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్ మధ్య స్నేహం కూడా బాగుంటుంది. ముఖ్యంగా చరణ్, పవన్ ఇద్దరూ బాబాయి అబ్బాయి అయినా.. స్నేహితులమని.. అన్నాదమ్ముల్లా ఉంటామని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే కెరీర్ ఆరంభంలో చరణ్ వద్ద డబ్బులు తీసుకునేదని.. వడ్డీతో సహా అప్పు తీర్చేస్తానంటూ ఎక్కువగా డబ్బులు తీసుకునేదంటూ పవర్ స్టార్ చెప్పారు. అయితే ఈ మాటలు ఇప్పుడు కాదండి.. చరణ్ మొదటి చిత్రం చిరుత ప్రమోషన్లలో బయటపెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు మళ్లీ నెట్టింట వైరల్ అవుతుంది.

మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన చిరుత సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు రామ్ చరణ్. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. అందులో చిరు మాట్లాడుతూ.. పవన్ సాధారణంగా చెర్రీ దగ్గర డబ్బులు అప్పు చేస్తూ ఉంటాడు అని అన్నారు. అందుకు పవన్ స్పందిస్తూ.. వదినను డబ్బులు అడగాలంటే ఇబ్బందిగా అనిపించేదని.. ఆ సమయంలో చరణ్ వద్ద ఉండే డబ్బులన్నీ తీసుకునేవాడినంటూ చెప్పుకొచ్చారు పవన్. చాలా సినిమాలు వస్తాయి.. బోలేడన్ని డబ్బులు వస్తాయి.. అవన్నీ మీకే ఇచ్చేస్తాను.. వడ్డీతో సహా ఇచ్చేస్తానని చెప్పి తీసుకునేవాడినని తెలిపారు పవన్. ఖుషీ సినిమా వరకు చెర్రీ దగ్గర డబ్బులు తీసుకున్నా.. కానీ ఇప్పటివరకు తిరిగి ఇవ్వలేదన్నారు. చరణ్ వద్ద అప్పు చేయడానికి తాను ఏం ఇబ్బందిగా ఫీల్ అవ్వను అని అన్నారు పవన్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.