
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు పండగలాంటి వార్త. ఎప్పటినుంచో వేచి చూస్తోన్న ఓజీ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే పవన్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ కు కూడా గుమ్మడి కాయ కొట్టే సమయం ఆసన్నమైంది. ఇదిలా ఉంటే తాజాగా ఓజీ సినిమా గురించి క్రేజీ అప్ డేట్ ఇచ్చింది. ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన వెలువడింది. ఈ ఏడాది దసరా కానుకగా సెప్టెంబర్ 25న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ‘ఫైరింగ్ వరల్డ్ 25 సెప్టెంబరు 25’ అని సోషల్ మీడియాలో ఓజీ కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. గత కొన్నిరోజులుగా ఏపీ డిప్యూటీ సీఎంగా బిజి బిజీగా ఉంటున్నారు పవన్ కల్యాణ్. అయితే ఇప్పుడు ఒప్పుకున్న సినిమాలను ఒక్కొక్కటిగా పూర్తి చేసే పనిలో పడ్డారు. అందులో భాగంగానే హరి హర వీర మల్లు సినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేశారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇక దీని తర్వాత ఓజీని పూర్తి చేసే పనిలో పడ్డారు పవన్. ఇటీవల షూటింగ్ మళ్లీ మొదలు పెట్టినట్లు చిత్ర బృందం కూడా ప్రకటించింది. వీలైనంత త్వరగా ఈ మూవీని పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
కాగా డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఓజీ సినిమాను ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నాడు. అలాగే అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్, హరీశ్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాను విడుదల చేసిన టీజర్ పవన్ ఫ్యాన్స్ కు తెగ నచ్చేసింది. ఇప్పుడు రిలీజ్ డేట్ కూడా ప్రకటించడంతో ఇక పవన్ అభిమానుల ఆనందానికి హద్దుల్లేవు.
FIRING WORLDWIDE in cinemas on
25th September 2025… 💥💥💥💥#OGonSept25#TheyCallHimOG #OG pic.twitter.com/DQAOFOrQxx
— DVV Entertainment (@DVVMovies) May 25, 2025
#OG will create Fire Storm Everywhere 🥵❤️🔥
pic.twitter.com/i3GfVmjyMt— Pawan Kalyan Holics™ (@PSPKHolics) May 25, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.