Johnny Movie : జానీ సినిమా హిట్టై ఉంటే నేను చేసే పని అదే.. పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఆయన మూవీస్ వస్తున్నాయంటే థియేటర్లు హౌస్ ఫుల్ అవ్వాల్సిందే. ఇటీవలే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పవన్ దర్శకత్వం వహించిన జానీ చిత్రం విడుదలై నేటికి 23 సంవత్సరాలు పూర్తైంది.

Johnny Movie : జానీ సినిమా హిట్టై ఉంటే నేను చేసే పని అదే.. పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే..
Johnny Movie

Updated on: Apr 25, 2026 | 9:40 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి తెలిసిందే. ముఖ్యంగా ఆయన సినిమాలకు ఉండే ఫాలోయింగ్ చెప్పక్కర్లేదు. బద్రి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పవన్.. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. తొలి ప్రేమ, తమ్ముడు, ఖుషి వంటి చిత్రాలతో నటుడిగా తనదైన ముద్ర వేశారు. చిరంజీవి సోదరుడిగా వెండితెరకు పరిచయమైన పవన్.. తన నటనతో.. మేనరిజంతో ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఎన్నో సవాళ్లు, విమర్శలను ఎదుర్కొని తన నటనతో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉండగానే పవన్ దర్శకత్వం వహించిన సినిమా జానీ. అప్పట్లో ఈ సినిమా ఓ సంచలనం అనే చెప్పాలి. అప్పటివరకు తాను నటించిన సినిమాల్లో కేవలం యాక్షన్ సీక్వెన్స్ మార్షల్ ఆర్ట్స్ మాత్రమే చేసిని పవన్.. జానీ సినిమా కోసం లాస్ ఏంజిల్స్, జపాన్ వెళ్లి మరిన్ని మెళకువలు నేర్చుకున్నారు.

ఎక్కువమంది చదివినవి : Monalisa : మోనాలిసా ప్రేమకథలో మరో భారీ ట్విస్ట్.. అప్పట్లో కుంభమేళా సుందరి.. ఇప్పుడు గర్భిణి!

అప్పటికే యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న పవన్ మేకోవర్ చూసి ఫ్యాన్స్ షాకయ్యారు. ముఖ్యంగా జానీ సినిమా సమయంలో పవన్ స్టైల్, కర్చీఫ్, బనియన్స్ తెగ ట్రెండ్ అయ్యాయి. అలాగే ఈ సినిమా విడుదలకు ముందే విడుదలైన పాటలు మూవీపై అంచనాలు క్రియేట్ చేశాయి. 250కి పైగా ప్రింట్స్ తో 2003 ఏప్రిల్ 25న విడుదలైంది ఈ మూవీ. ఎన్నో అంచనాలతో థియేటర్లలోకి అడుగుపెట్టిన అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. ఎందుకంటే ఖుషి, బద్రి సినిమాల్లో చూసిన పవన్ లుక్స్ ఆ సినిమాలో కనిపించలేదు. పూర్తిగా బక్క చిక్కిన పవన్ ను ఫ్యాన్స్ తట్టుకోలేకపోయారు.

ఎక్కువమంది చదివినవి : Srikanth-Ooha : ఏంటీ.. ఆ స్టార్ నటుడు ఊహ మేనమామనా..? 100 సార్లు ఉత్తమ నటుడు.. తెలుగు వారికి సుపరిచితమే..

గతంలో ఓ ఇంటర్వ్యూలో పవన్ మాట్లాడుతూ.. “నేను నటించి దర్శకత్వం వహించిన సినిమా ప్లాప్ అయ్యింది. సత్యం ఒప్పుకుని తీరాలి. తప్పించుకుని తిరగడానికి వీల్లేదు. క్రియేటివ్ ఫీల్డ్ లో ఫెయిల్యూర్ సహజం. దానికి భయపడకూడదు. ఆ సమయంలో నాకు అన్నయ్య చెప్పిన మాట గుర్తుంది. ఇంకా కష్టపడి ఉంటే బాగుండేది అన్నారు. కష్టపడ్డాను. కానీ అది సరైన దారిలో విధి విధానాలతో కష్టపడలేదేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. జానీ సినిమా అవివేకంతో చేయలేదు. నాకు తెలిసి ఆరోజుకు దొరికిన మార్గాన్ని ఎంచుకున్నా. జానీ సినిమా సక్సెస్ అయ్యి ఉంటే సినిమాలు వదిలేసేవాడిని” అంటూ చెప్పుకొచ్చారు.

ఎక్కువమంది చదివినవి : Srikanth-Ooha : ఏంటీ.. ఆ స్టార్ నటుడు ఊహ మేనమామనా..? 100 సార్లు ఉత్తమ నటుడు.. తెలుగు వారికి సుపరిచితమే..

Follow Us