
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాలు, మరో వైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల లిస్ట్ చాలా పెద్దదే.. పవన్ కళ్యాణ్ చివరిగా బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఇప్పుడు ఓజీ సినిమాతో ప్రేక్షకులను అలరించనున్నారు. సాహో సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న సుజిత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచివిడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఓజీ సినిమాతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఈ సినిమా షూటింగ్ కూడా సైలెంట్ గా జరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఇక రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు.
తాజాగా పవన్ కళ్యాణ్ ఓ తమిళ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయా ఇంటర్వ్యూలో యాంకర్ రాజకీయాల్లో బిజీగా మారిపోయారు గా ఇక సినిమాలు చేయడం మానేస్తారా.? అని ప్రశ్నించారు. దానికి పవన్ కళ్యాణ్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. నాకు డబ్బు అవసరమైనంత కాలం సినిమాలు చేస్తూనే ఉంటాను. అయితే అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ జాబ్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వను అని పవన్ కళ్యాణ్ అన్నారు. దాంతో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.
అలాగే తమిళనాడు రాజకీయాల పై కూడా పవన్ స్పందించారు. తనకు రాజకీయాల్లో పలువురు నాయకులు స్ఫూర్తిగా ఉన్నా తమిళనాడులో ఎంజీఆర్, అన్నాదురై పెద్ద ప్రేరణగా నిలిచారని పేర్కొన్నారు. నటుడిగా ఉండి వెంటనే ముఖ్యమంత్రి కాలేరన్నారు. ఎన్టీఆర్‌కు జరగలేదా? అనే ప్రశ్నకు ‘అది అరుదైన ఒకటి’ అని, ఆయనకు మాత్రమే దక్కిన అవకాశమని పవన్ అన్నారు. ఇక భవిష్యత్తులో అన్నాడీఎంకేతో జనసేన పొత్తు అవకాశాలను కొట్టి పారేయలేమన్నారు పవన్. ప్రజాస్వామ్యంలో ప్రతి నిర్ణయం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే ఉండాలని తెలిపారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కూడా బలమైన, మంచి నాయకుడన్నారు. తమిళనాడుకు సేవలు అందించడానికి తగిన నాయకుడని, ఆయనకు మంచి భవిష్యత్తు ఉందని పేర్కొన్నారు. ఇక విజయ్ కు ఏదైనా సలహా ఇస్తారా అని అడగ్గా.. రాజకీయం అనేది క్లిష్టమైన ప్రయాణమని, దానికి సిద్ధపడాలని తెలిపారు.