Ustaad Bhagat Singh: పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అప్డేట్ వచ్చేసింది.. ఫ్యాన్స్ కు ఇక పండగే

'ఓజీ' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. దీని తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ గా ఆడియెన్స్ ముందుకు రానున్నారాయన. హరీశ్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఈ మూవీ నుంచి లేటెస్ట్ గా ఒక అప్డేట్ వచ్చింది.

Ustaad Bhagat Singh: పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అప్డేట్ వచ్చేసింది.. ఫ్యాన్స్ కు ఇక పండగే
Ustaad Bhagat Singh Movie

Updated on: Dec 07, 2025 | 7:00 PM

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరి కాంబోలో వస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. దీనికి తగ్గట్టుగానే ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సినిమాలో పవన్ సరసన రాశీ ఖన్నా, శ్రీలీల హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్స్, గ్లింప్స్ మెగాభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దీనికి తోడు మూవీలో పవన్ కల్యాణ్ హుషారైన స్టెప్పులు వేయనున్నట్లు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోన్న సినిమాకు సంబంధించి ఇవాళ్టి ఉదయం నుంచి ఒక వార్త నెట్టింట బాగా చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్‌ సింగిల్‌ ఈ రోజు సాయంత్రం విడుదల కానుందట. మెగా అభిమానుల కోసం అషీషియల్‌ గ్లింప్స్‌ విడుదల చేయనున్నారన్న వార్త ఉదయం నుంచి బాగా చక్కర్లు కొడుతోంది. అయితే పవన్ మూవీ నుంచి ఆదివారం ఎలాంటి అప్డేట్ రావడం లేదు. అయితే మెగాభిమానులు కోరుకున్నట్లుగానే ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి త్వరలోనే ఫస్ట్ సింగిల్ రానుంది. తాజాగా ఇదే విషయంపై మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టింది.

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోని మొదటి పాట ప్రోమోని డిసెంబర్ 9 సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఫుల్ సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఆ ప్రోమోతో పాటు ప్రకటించనున్నారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ పవన్ కల్యాణ్ బ్లాక్ కలర్ స్టైలిష్ అవుట్ ఫిట్ లో ఉన్న పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు మేకర్స్. ప్రస్తుతం పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇందులో పవన్ కల్యాణ్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .