పవర్‌స్టార్‌తో సినిమా.. ఆ స్టార్ కొరియోగ్రాఫర్‌కి గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చిన పవన్ కల్యాణ్‌..!

పవర్‌స్టార్ పవన్‌ కల్యాణ్ ఫ్యాన్స్‌కి వరుస ట్రీట్లను ఇవ్వబోతున్నారు. ఇప్పటికే ఐదుగురికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు పవన్. ఇందులో వకీల్ సాబ్ షూటింగ్‌ క్లైమాక్స్‌లో ఉండగా..

పవర్‌స్టార్‌తో సినిమా.. ఆ స్టార్ కొరియోగ్రాఫర్‌కి గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చిన పవన్ కల్యాణ్‌..!

Edited By:

Updated on: Nov 30, 2020 | 1:18 PM

Pawan Kalyan movies: పవర్‌స్టార్ పవన్‌ కల్యాణ్ ఫ్యాన్స్‌కి వరుస ట్రీట్లను ఇవ్వబోతున్నారు. ఇప్పటికే ఐదుగురికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు పవన్. ఇందులో వకీల్ సాబ్ షూటింగ్‌ క్లైమాక్స్‌లో ఉండగా.. మిగిలినవి పూర్తయ్యే సరికి మరో ఏడాదికి పైననే పట్టనుంది. అయితే ఈ లోపు మరో సినిమాకు పవన్ ఓకే చెప్పినట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ డ్యాన్స్ మాస్టర్‌ జానీకి పవన్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

పవన్‌ని ఎంతగానో అభిమానించే జానీ మాస్టర్‌.. ఆయనతో సినిమా తీయాలనుందని, కథలు కూడా రెడీగా ఉన్నాయని పలు సందర్భాల్లో వెల్లడించారు. ఆయనను డైరెక్ట్ చేయడం తన చిరకాల కోరిక అని తెలిపారు. ఈ క్రమంలో ఇటీవల జానీ, పవన్‌ని కలవడం.. స్టోరీ చెప్పేయడం జరిగిపోయాయని తెలుస్తోంది. ఇక కథ నచ్చేయడంతో ఫుల్‌ స్క్రిప్ట్‌తో రమ్మని జానీకి సూచించారట పవర్‌స్టార్‌. ఒకవేళ అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ కాంబోలో సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.